తోటకూర పోషకాలకు గని.. ఆరోగ్యానికి ఖజానా..!
తోటకూరను చాలా మంది పక్కన పెడుతుంటారు. కానీ ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. దీంతో కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూరలో విటమిన్లు ఎ, సి, కె లతోపాటు ఫోలేట్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
కంటి చూపు మెరుగు పడుతుంది. కళ్ల సమస్యలు తగ్గుతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదల తగ్గుతుంది. దీంతో క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.
తోటకూర గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది.
ఇది హైబీపీని నియంత్రిస్తుంది. గుండె సమస్యలు రాకుండా చూస్తుంది. తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగానే ఉంటాయి. ఇవి గుండెను రక్షిస్తాయి.
ఒత్తిడి, వాపుల నుంచి రక్షిస్తాయి. అధిక బరువు తగ్గాలనుకుంటున్నవారు తోటకూరను తప్పనిసరిగా తీసుకోవాలి.
తోటకూరలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పోషక పదార్థం అని చెప్పవచ్చు.
తోటకూరలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది.
రక్తహీనత సమస్య ఉన్నవారికి తోటకూర వరమనే చెప్పవచ్చు. తోటకూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల తోటకూరను తింటుంటే ఐరన్ పుష్కలంగా లభించి రక్తం అధికంగా తయారవుతుంది
Learn more