కవల అరటిపండ్లను తాంబూలంలో ఇస్తున్నారా.. ఇకపై ఇవ్వకండి ఎందుకంటే?
మనకు ఏ కాలాలతో సంబంధం లేకుండా దొరికే పండ్లలో అరటి పండ్లు ఒకటి. అరటి పండ్లకు ఆరోగ్య పరంగాను, ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఏ పూజ జరిగినా తప్పనిసరిగా ఆ దేవుడికి నైవేద్యంగా అరటిపండ్లను సమర్పిస్తాము. అదేవిధంగా మన ఇంటికి ఎవరైనా ముత్తయిదువులు వచ్చిన తాంబూలంలో అరటి పండ్లను ఇస్తాము. అయితే అరటి పండ్లలో కవల అరటి పండ్లు రావడం మనం చూస్తూ ఉంటాము. కవల అరటి…