గోర్ల‌ను ఎందుకు కొరుకుతారో తెలుసా..?

గోర్లు కొర‌క‌డం చాలా మందికి ఉండే అల‌వాటు. చిన్నారులే కాదు, కొంద‌రు పెద్దలు కూడా గోర్ల‌ను ప‌దే ప‌దే కొరుకుతుంటారు. అయితే నిజానికి గోర్ల‌ను కొర‌క‌డ‌మ‌నేది చాలా చెడు అల‌వాటు. అది ఎవ‌రికైనా అస్స‌లు ఉండ‌కూడ‌దు. ఈ క్ర‌మంలో అస‌లు ఎవ‌రైనా గోర్ల‌ను ఎందుకు కొరుకుతారో మీకు తెలుసా..? ప‌లువురు సైంటిస్టులు, ప‌రిశోధ‌న‌లు ఇదే విషయంపై స్ట‌డీ చేశారు. అస‌లు మ‌నం గోర్ల‌ను ఎందుకు కొరుకుతామ‌న్న దానికి వారు కొన్ని స‌మాధానాలు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దామా. … Read more

డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ప్రిస్క్రిప్షన్ లో అర్ధం కాకుండా ఎందుకు రాస్తారో తెలుసా.? 3 కారణాలు ఇవే.!

సుస్తీ చేస్తే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్ల‌డం, ల‌క్ష‌ణాలు చెప్ప‌డం, ఆరోగ్య ప‌రిస్థితిని వివ‌రించ‌డం, ఆయ‌న ఇచ్చిన చిట్టీ ప‌ట్టుకుని మందులు కొన‌డం, మింగడం… ఇదీ అనారోగ్యం బారిన ప‌డిన ఎవ‌రైనా చేస్తారు. అయితే ముఖ్యంగా డాక్ట‌ర్ రాసిన మందుల చిట్టీ (ప్రిస్క్రిప్ష‌న్‌) విష‌యానికి వ‌స్తే అందులో డాక్ట‌ర్లు రాసేది మ‌న‌కు అస్స‌లు అర్థం కాదు. ఎంత సేపు ప్ర‌య‌త్నించినా మ‌నం వారు రాసిన ప‌దాల‌ను క‌నుక్కోలేం. కానీ ఫార్మ‌సీలో మాత్రం చ‌క చ‌కా ఆ చిట్టీ చ‌దివి … Read more

ఏ వ‌యస్సులో ఉన్న‌వారికి ఎంత నిద్ర అవ‌స‌రం అంటే..?

నిద్ర బంగారం. ఆ మాటకొస్తే బంగారం కన్నా గొప్పదీనూ. ఇది కొరవడకుండా చూసుకుంటే ఆరోగ్యం సొంతమవుతుంది. మున్ముందు జబ్బుల బారినపడకుండా కాపాడుతుంది. చురుకుదనం, పనుల్లో సామర్థ్యం ఇనుమడిస్తుంది. చదువుల్లో, ఉద్యోగాల్లో రాణించేలా చేస్తుంది. మొత్తంగా శారీరక, మానసిక, సామాజిక ఉన్నతికి తోడ్పడుతుంది. ఎంత నిద్ర అవసరమనేది ఆయా వ్యక్తులను బట్టి ఉంటుంది. కొందరికి 4 గంటల నిద్రే సరిపోవచ్చు. కొందరికి 9 గంటలు అవసరమవ్వచ్చు. చాలామందికి 7-8 గంటలు సరిపోతుందని చెప్పుకోవచ్చు. వయసు మీద పడుతున్నకొద్దీ దీని … Read more

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

శరీరానికి కావాల్సిన శక్తి చక్కగా అందాలంటే.. దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. దంతాలు బాగుంటేనే ఆహారాన్ని మంచిగా నమిలి మింగడంతో త్వరగా జీర్ణమై శక్తి వస్తుందని భావిస్తాం మనం. కానీ నోటి అపరిశుభ్రతకూ గుండెజబ్బు, మధుమేహం వంటి సమస్యలకూ సంబంధం ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి కారణమేంటన్నది స్పష్టంగా తెలియ లేదు గానీ దీర్ఘకాల వాపు వంటి సమస్యలు ఇందుకు దోహదం పడతాయని భావిస్తున్నారు. చిగుళ్లు, దంతాల ఇన్‌ఫెక్షన్లు, వీటికి కారణమయ్యే బ్యాక్టీరియా నోటి కణజాలాన్ని … Read more

ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. మీ మాన‌సిక ఆరోగ్యం పాడవుతుంది..!

చెడు అలవాట్లకు బానిస కావడానికి ఎక్కువ సమయం పట్టదు. తమకున్న ఈ అలవాట్ల వలన కీడు జరుగుతుందని తెలిసినా.. చాలా మంది వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయరు. ఇంకా చెప్పాలంటే.. చిన్నగా, సరదాగా మొదలయ్యే కొన్ని అలవాటు దురలవాట్లుగా మారతాయి. నిద్ర లేమి, లేదా వ్యాయామానికి దూరంగా ఉండడం వంటివి ఈ చెడు అలవాట్ల జాబితాలో ఉన్నాయి. మానసిక ఆరోగ్యాన్ని పాడుచేసే అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు సూర్యరశ్మిని పొందలేరు. … Read more

నీళ్ల‌ను త‌గిన మోతాదులో తాగ‌క‌పోతే జ‌రిగే అన‌ర్థాలు ఇవే..!

ఆరోగ్యకరమైన జీవితానికి ఎలాంటి డైట్ తీసుకోవాలో.. ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకోడానికి ముందు తినడానికన్నా మంచి నీళ్లు తాగడం చేస్తూ ఉంటాడు. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం రోజుకు కనీసం 6 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది. అలా చేస్తే ఎలాంటి రోగం మీ దరి చేరకుండా ఉంటుంది. జీవక్రియ సక్రమంగా నడిచేలా చేసే ఇంధనమే నీరు. అయితే అలాంటి నీరు శాతం శరీరంలో తక్కువవడం వల్ల అనేక రోగాలకు దారి తీస్తుంది. నీరు సరిగా తాగకపోతే హై … Read more

రోజూ స‌రిగ్గా నిద్ర పోవ‌డం లేదా..? అయితే ఏం జ‌రుగుతుందంటే..?

ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా కొన్ని అలవాట్లు ఉండాలి. సరిపడా నిద్ర, శరీరానికి సరిపడా నీళ్లు, మంచిగా ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం ఇలా ఎన్నో.. అయితే మనిషి ఆరోగ్యంగా ఉండడానికి నిద్ర అనేది ముఖ్యపాత్ర పోషిస్తుంది. మంచి నిద్రని పొందితే కచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉంటాము కానీ ఈ రోజుల్లో చాలా మంది తక్కువ సేపు నిద్రపోతున్నారు. నైట్ డ్యూటీ, ఫోన్ లోనే సమయాన్ని గడపడం వంటి … Read more

ఐస్ లేదా హీట్ ప్యాక్‌ల‌ను ఏయే నొప్పుల‌కు పెట్టాలో తెలుసా..?

దెబ్బ త‌గ‌ల‌డం, అనారోగ్యం, వాపులు… త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల శ‌రీరంలోని ఆయా భాగాల్లో అప్పుడ‌ప్పుడు మ‌న‌కు నొప్పులు వ‌స్తుంటాయి. కొన్ని నొప్పులు వెంట‌నే త‌గ్గిపోతాయి. కానీ కొన్ని మాత్రం అలా కాదు. అవి ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు. అందుకోసం మ‌నం ర‌క ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తాం. కాప‌డం పెట్ట‌డం, ఐస్ ప్యాక్ ఉంచ‌డం, స్ప్రే వాడ‌డం, పెయిన్ కిల్ల‌ర్స్ వేసుకోవ‌డం చేస్తాం. అయితే… మందుల‌ను వాడే సంగ‌తి ప‌క్క‌న పెడితే స‌హ‌జ సిద్ధ ప‌ద్ధ‌తులైన కాప‌డం పెట్ట‌డం, … Read more

పొగ తాగడం వ‌ల్ల గుండెకు ఎలాంటి న‌ష్టం జ‌రుగుతుందో తెలుసా..?

సిగరెట్ లోని లేదా పొగాకు లోని కార్బన్ మొనాక్సైడ్, రక్తం ఆక్సిజన్ ను రవాణా చేయకుండా చేస్తుంది. పొగతాగటం మొదలైన ఒక్క నిమిషంలో నాడి కొట్టుకోవడం పెరుగుతుంది. మొదటి 10 నిమిషాలలో నాడి కొట్టుకోవడం 30 శాతం వరకు పెరుగుతుంది. పొగ తాగటం రక్తపోటు అంటే బి.పి.ని కూడా అధికం చేస్తుంది. పొగతాగడం రక్తంలోని కొల్లెస్టరాల్ స్ధాయిలను పెంచుతుంది. మంచి కొల్లస్టరాల్ ను చెడు కొల్లెస్టరాల్ గా మారుస్తుంది. ఫిబ్రినోజన్, ప్లేట్ లెట్ ల ఉత్పత్తి స్ధాయిలను … Read more

గొంతులో తెమ‌‌‍‌డ ఏర్పడటం ఏమిటి? నివారణ ఏమైనా ఉందా?

గొంతులో తెమ‌‌‍‌డ‌ అంటే….. గొంతులో శ్లేష్మం పేరుకుపోవడం వలన గొంతులో చికాకు, దగ్గు వంటి లక్షణాలు ఏర్పడతాయి. ముక్కు పట్టేసి, గొంతు పట్టేసి తినడానికి, నిద్ర పోవడానికి కూడా ఇబ్బంది పెడుతుంది. గొంతులో తెమ‌‌‍‌డ‌ రావడానికి కారణాలు…. వైరల్ ఇన్ఫెక్షన్లు…. జలుబు, ఫ్లూ, శ్వాసకోశ వైరస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు గొంతులో తెమ‌‌‍‌డ‌కి అత్యంత సాధారణ కారణాలు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు….. స్ట్రెప్ థ్రోట్ వంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు కూడా గొంతులో తెమ‌‌‍‌డ‌కి కారణమవుతాయి. అలెర్జీలు….. ధూళి, పుప్పొడి, … Read more