మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన పెద్దవాళ్లు కలల గురించి ఒక విషయాన్ని అంటుంటారు. తెల్లవారుజామున వచ్చే కలలు నెరవేరుతాయని అంటారు.
ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధం ఉందో తెలియదు కానీ స్వప్న శాస్త్రం ప్రకారం ఒక్కో కల ఒక్కో ఫలితాన్ని ఇస్తుంది. అయితే కలలో ఇవి కనిపిస్తే మీరు త్వరలో కోటీశ్వరులు అవుతారట. అవేంటో ఒకసారి చూసేద్దామా. కలలో ఉదయిస్తున్న సూర్యుడు లేదా చంద్రుడు కలలో కనిపిస్తే త్వరలో మీకు డబ్బు చేతికి అందుతుందని అర్థం.
ఆవు పాలు ఇస్తున్నట్టు కనిపిస్తే మీకు ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. బంగారం, చక్కటి అద్దాలు కలలో కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుందని స్వప్న శాస్త్ర నిపుణులు అంటుంటారు. సప్న శాస్త్రం ప్రకారం ఉదయం పూట వచ్చే కలలు నిజమవుతాయని నమ్ముతుంటారు.