ప్రస్తుతం చాలామంది ఎటైనా బయటకు వెళ్తే రోడ్డు పక్కన హోటల్ లో దొరికే రకరకాల ఆయిల్ ఫుడ్స్ తింటూ ఉంటారు. దీని వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎక్కువగా తింటే రాత్రిపూట మేలుకోవడం, తిన్న కాసేపటికి కడుపు ఉబ్బడం వంటివి తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ ఫుడ్ తినడం వల్ల గుండె నొప్పులు ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఈ రోగాల బారిన పడకూడదు అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
చాలా మంది బయట బండిమీద దొరికే పునుగులు, బోండాలు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఆపేస్తే సగం జబ్బులు రావు. అంతేకాదు ఉదయాన్నే రైతులు చద్దన్నం, ఉల్లిపాయను నంజుకొని ప్రతిరోజు తింటారు. అలా పట్టణాల్లో ఉండేవారు కూడా చేస్తే 100 శాతం కొన్ని జబ్బులు రావు. ఎక్కువగా బ్రెయిన్ ఒత్తిడికి గురవడం, హార్ట్ ఎటాక్ కారణం అవుతుంది.
ముఖ్యంగా శరీరంలో అవసరమైన అధిక కొవ్వు నిలువలు ఉండడం వల్ల రక్తనాళాల మీద ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల రక్త ప్రసరణ కష్టమై గుండెకు రక్త పంపిణీ కష్టమైపోతుంది. అధికంగా బరువు వల్ల గుండె పనితీరుకు ఆటంకాలు ఏర్పడి గుండెపోటుకు కారణం కావచ్చు. కనుక ఒబేసిటీ ఉన్నవారు ప్రతి రోజు 6 గంటల పాటు కష్టపడి శరీరం అలసిపోయేటట్టు పనిచేయాలి. కనీసం గంటైనా వ్యాయామం చేయాలి.