షర్ట్ వెనకాల కాల‌ర్ కింద ఇలా ఉండేది గమనించారా.? ఎందుకుంటుందో తెలుసా.? కారణం ఇదే.!

చొక్కాలు ధ‌రించ‌డం అనేది ఇప్ప‌టి మాట కాదు. ఎప్ప‌టి నుంచో వాటిని మ‌నం ధ‌రిస్తున్నాం. ఆ మాట‌కొస్తే అవి అస‌లు ఎప్పుడు, ఎక్క‌డ, ఎలా వాడుక‌లోకి వ‌చ్చాయో మ‌న‌కు తెలీదు. కానీ ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో అవి చ‌లామ‌ణీ అవుతూనే ఉన్నాయి. ఒక‌ప్పుడంటే వేరే కానీ, ఇప్పుడు ఆడ‌, మ‌గ ప్ర‌తి ఒక్క‌రూ ష‌ర్ట్స్ ధ‌రిస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా ష‌ర్ట్స్‌కు సంబంధించిన ఓ మ్యాట‌రే. అదేమిటంటే… మీరెప్పుడైనా చొక్కా వెనుక భాగంలో కాల‌ర్ కింద ఓ … Read more

విమానాల‌కు తెలుపు రంగునే ఎందుకు వేస్తారో తెలుసా..?

మీరు విమానాల‌ను ఎప్పుడైనా చూశారా..? ఇదేం ప్ర‌శ్న‌..? విమానాల‌ను చూడ‌ని వారుంటారా ఎవ‌రైనా..? అని అడ‌గ‌బోతున్నారా..? అయితే మీరు అంటోంది క‌రెక్టే. కానీ ఇప్పుడు మేం చెప్ప‌బోయేది విమానాల‌ను చూశారా, చూడ‌లేదా అన్న దాని గురించి మాత్రం కాదు. విమానం రంగును గురించి. అవును, రంగే. ఇంత‌కీ మీరు ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని విమానాల‌ను చూశారు..? వాటికి ఉన్న రంగు ఏమిటో గుర్తుందా..? ఆ… గుర్తుంది, తెలుపు రంగు ఉంటుంది. విమానం ముందు వెనుక భాగాల్లో, రెక్క‌ల‌కు … Read more

మిణుగురు పురుగులు కాంతిని ఎందుకు వెద‌జ‌ల్లుతాయో తెలుసా..?

మిణుగురు పురుగుల గురించి తెలుసు క‌దా. వీటిని చూడ‌ని వారుండ‌రు. రాత్రి వేళల్లో మిణుకు మిణుకుమంటూ వెలుతురును వెద‌జ‌ల్లుతాయి. వాటి నుంచి వ‌చ్చే కాంతి విభిన్నంగా ఉంటుంది. ఈ క్ర‌మంలో మిణుగురు పురుగుల‌ను ప‌ట్టుకునేందుకు, వాటితో ఆట‌లాడేందుకు చాలా మంది య‌త్నిస్తారు. అదో ర‌క‌మైన స‌ర‌దాగా ఉంటుంది. అయితే నిజానికి మిణుగురు పురుగుల‌కు ఆ వెలుతురు ఎందుకు వ‌స్తుందో తెలుసా..? అవి వెలుతురును ఎందుకు వెదజ‌ల్లుతాయో ఇప్పుడు చూద్దాం. మిణుగురు పురుగులు వెలుతురు వెలువరించడానికి కారణం జీవ … Read more

ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే అని ఎందుకు అంటారో తెలుసా..? వెనకున్న ఆసక్తికర విషయం ఇదే..!

ఏప్రిల్ నెల వ‌స్తుందంటే చాలు అంద‌రికీ ఒక విష‌యం గుర్తుకు వ‌స్తుంది. అబ్బే.. ఏప్రిల్ 1 నుంచి పెర‌గ‌బోయే ధ‌ర‌లు కాదు లెండి. ఇప్పుడా విష‌యాల గురించి మాట్లాడి మిమ్మ‌ల్ని ఇబ్బంది పెట్ట‌ద‌లుచుకోలేదు. మ‌రి ఏ విష‌యం అంటే.. అదేనండీ.. ఏప్రిల్ నెల వ‌స్తుంద‌న‌గానే మ‌న‌కు ఏప్రిల్ ఫూల్స్ డే గుర్తుకు వ‌స్తుంది క‌దా. ఏప్రిల్ 1వ తేదీన మ‌న‌కు తెలిసిన వారిని ఎలా ఫూల్ చేయాలా అని ఆలోచించి మ‌రీ అందుకు అనుగుణంగా ప్లాన్ వేసి … Read more

బైక్ డ్రైవ్ చేసే సమయంలో వెనక కూర్చున్నవారు ఎడమవైపుకి ఎందుకు కూర్చుంటారో తెలుసా..?

ఒకప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా సరే సైకిల్ ఎక్కాల్సిందే, పెడల్ తొక్కల్సిందే. కానీ ఇప్పుడు ఎటు చూసినా ఖరీదైన బైక్ లు ర‌య్యిమని దూసుకెళ్తున్నాయి. ఎవరికి కెపాసిటీని బట్టి వాళ్ళు రకరకాల వెహికిల్స్ వాడుతున్నారు. అయితే బైక్ మీద ప్రయాణం చేసే సమయంలో మనం ఎవరినైనా గమనిస్తే రకరకాలుగా కూర్చుంటారు. ముఖ్యంగా మహిళలను గమనిస్తే వారు ఎడమవైపుకి తిరిగి మాత్రమే కూర్చుంటారు. కొంతమంది నడుము నొప్పి, మరి కొంతమంది మరికొన్ని కారణాలతో ఇలా కూర్చుంటూ ఉంటారు. కానీ చాలావరకు … Read more

విమానం రెక్క‌లు వంగి ఎందుకు ఉంటాయో తెలుసా..?

విమానాల్లో మీరెప్పుడైనా ప్ర‌యాణించారా..? లేదా..! అయినా ఏం ఫ‌ర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది అందుకు సంబంధించి కాదు, కానీ విమానాలకు చెందిన‌దే. అందుకు విమానాల్లో ప్ర‌యాణించాల్సిన ప‌నిలేదు. వాటిని చూసి ఉంటే చాలు. ఇంత‌కీ ఏంటా విష‌యం అంటారా..? ఏమీ లేదండీ… విమానాల రెక్క‌లు మొద‌లు నుంచి చివ‌రి వ‌ర‌కు స‌మ‌త‌లంగా ఉండ‌కుండా చివ‌ర‌ల్లో ఓ వైపుకు లేదా రెండు వైపుల‌కు వంగి ఉంటాయి క‌దా..! అయితే అవి అలా ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..? … Read more

ఇప్పుడున్న కొండచిలువలు మనుషుల్ని మింగగలవా?

ఒక్క అనకొండలు మాత్రం మనిషిని మ్రింగగలవ్ అనుకుంటే అది హాలీవుడ్ సినిమా అనకొండ ప్రభావమే! అలానే గ్రేట్ ఆఫ్రికన్ రాక్ పైథాన్ ఖచ్చితంగా మ్రింగగలదు అని అనుకుంటే డిస్కవరీ బాగా చూస్తున్నారని అర్థం. ఐతే ఇవి పిల్లలను మ్రింగగలవు. ఇండియన్ పైథాన్ కూడా అంతే! ఐతే రిటైక్యులేటెడ్ పైథాన్ మాత్రం మిగతా అన్నింటిలోకీ పెద్ద కొండచిలువ జాతి. ప్రపచంలోనే అతి పెద్ద పాము. ఏ కొండచిలువైనా ఇదారేళ్ళ పిల్లల్ని తేలిగ్గా మ్రింగేయగలదు. ఇవి సాధారణంగా గొఱ్ఱెలను, మేకలను, … Read more

OYO అంటే ఇంత అర్థం ఉందా! ఈ మాత్రం తెలియకుండానే అక్కడికి వెళ్తున్నారా?

పిల్లల నుండి పెద్దల వరకు OYO అంటే తెలియని వాళ్లు ఉండరు. తెలియని ప్రాంతానికి వెళ్లి, అక్కడ ఉండాలంటే టక్కున గుర్తుకు వచ్చేవి ఓయో రూమ్స్‌నే. అయితే ఆ రూమ్స్‌కి ఓయో రూమ్స్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? OYO దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. పిల్లల నుండి పెద్దల వరకు, OYO అందరికీ సుపరిచితం. అతి తక్కువ ధరలోనే ఉండడానికి రూమ్స్ అందిస్తుంది. అలాగే ఏదైనా ఇతర హోటల్‌లో గదిని బుక్ చేసుకోవడానికి చాలా … Read more

పల్లవులు , చోళుల వారసులు ఇప్పుడు ఏమైపోయారు..?

ఏమీ అయిపోలేదండీ.. మన తెలుగు వారికి కూడా మన చరిత్ర తెలియకుండా కప్పెట్టేసారే అని పల్లవుల ఆత్మలు క్షోభిస్తున్నాయి అట.. చరిత్రకారుల అంచనా ప్రకారం పల్లవులు గోదావరి జిల్లాల నుంచి కానీ, గుంటూరు, నెల్లూరు జిల్లాల(నేటి పల్నాడు ప్రాంతం -పల్లవ నాడు అనే వాదన కూడా ఉంది) నుంచి కానీ వలస వెళ్ళి నేటి చెన్నై కి సమీపంలో ఉన్న కాంచీపురం (కంచి) లో తమ పల్లవ సామ్రాజ్యం స్థాపించారు.. పల్లవ రాజులు కొన్ని శాసనాల్లో తమని … Read more

జంతువులు మనల్ని తిన్నప్పుడు మనం మాత్రం జంతువులని ఎందుకు తినకూడదు?

మనిషికి మాత్రమే జంతువులు శత్రువులు. సింహం, పులి, చిరుత, మొసలి, పాము, వగైరాలతో మనిషి మాత్రమే వైరం పెట్టుకుంటాడు. కానీ, ఆయా జంతువులు మనని శత్రువుగా కాదు కదా కనీసం జంతువుగా కూడా కన్పిడర్ చేయవు. ఎందుకంటే మనిషి మాంసం వాటికి రుచించదు కాబట్టి. సింహం గానీ, పులిగానీ మనిషిని తినాలని అనుకోవు. అసలు మనిషిని వేటాడానికి గానీ, తినడానికి గానీ ఇష్టపడవు. వాటి ఆహార సముపార్జన కోసం పరుగులు పెట్టినప్పుడు, దుప్పి వగైరాలను వేటాడినప్పుడు గానీ … Read more