నారింజ పండ్లను తిన్నాక తొక్కలను పడేయకండి.. వాటితోనూ ప్రయోజనాలు కలుగుతాయి.. అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు..!
నారింజ పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు మనకు నారింజ పండ్ల వల్ల కలుగుతాయి. అయితే ఈ పండ్లే కాదు, వీటి తొక్కల వల్ల కూడా మనకు ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నారింజ పండు తొక్కల్లో హెస్పెరిడిన్…