అప్పట్లో పాక్ గగనతలంలోకి బ్రహ్మోస్‌ను వదిలిన భారత్.. పొరపాటున చేశారా.. కావాలనే చేశారా..?
పాకిస్తాన్ కి చెందిన Center for International Stratagic Studies వారు 2024 లో ఒక report publish చేశారు. అది ఇప్పుడు మళ్ళీ ప్రధాన చర్చ గా మారింది. క్లుప్తం గా దాని సారాంశం మీముందు ఉంచుతున్నాను. అందులో, మార్చి 9, 2022 లో పొరపాటున భారత్ నుంచీ వచ్చిన బ్రహ్మోస్ క్షిపణి ఘటన గురించి వారి అనాలిసిస్ చూడవచ్చు. దాని ప్రకారం ఇది పొరపాటు కాదు అని ఉద్దేశపూర్వకం గా చేసిన పని అని…