ఆధ్యాత్మికం

ఇంట్లో ఎవ‌రైనా చ‌నిపోతే ఏడాది వ‌ర‌కు పూజ‌లు చేయ‌కూడ‌దా..?

ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఏడాది అంతా కూడా పూజలు చేయకూడదని చాలా మంది అనుకుంటారు. అదే విధంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఏడాది అంతా కూడా పండగలు కూడా చేసుకోరు. అయితే నిజంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది మొత్తం దేవుడికి అసలు పూజలే చేయకూడదా…? దేవుడి గదిని మూసేసి ఉంచాలా… అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి మీకు కూడా ఈ సందేహం ఉన్నట్లయితే ఇప్పుడే క్లియర్ చేసుకోండి.

చాలా మంది ఏం చేస్తారంటే ఎవరైనా ఇంట్లో చనిపోతే దేవుడి సామాన్లు అన్ని మూటకట్టి అటక మీద పెట్టేస్తూ ఉంటారు. రోజు దీపారాధన కూడా చేయరు. దేవుడి గది తలుపు మూసేసి ఉంచేస్తారు సంవత్సరం వరకు కూడా దేవుడికి సంబంధించిన వేటిల్లోనూ కూడా పాల్గొన‌రు. పండగలకు కూడా దూరంగా ఉంటారు. అయితే పురాణాల్లో కానీ ఎక్కడా కానీ ఎవరైనా ఇంట్లో వాళ్ళు చనిపోతే ఆ సంవత్సరం అంతా పూజలు చేయకూడదని ఏమి రాసి లేదు.

can we do pooja to god if somebody dies in our home

దీపారాధన చేసుకోవచ్చు దీపారాధన చెయ్య‌ని ఇల్లు స్మశానం తో సమానం అయితే మనిషి చనిపోయిన పది రోజులు వరకు కూడా దేవుడి కి పూజ చేయకూడదు 11 రోజుల నుండి యధావిధిగా పూజ చేసుకోవచ్చు. దీప దీప నైవేద్యాలు లేకుండా అలా ఏడాది అంతా ఇల్లు ఉంటే అనేక ఇబ్బందులు కలుగుతాయి. అది అరిష్టం కూడా. కాబట్టి కచ్చితంగా పూజలు చేసుకోవడం దీపారాధన చేయడం చాలా అవసరం.

Admin

Recent Posts