వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. అలాంటి వివాహాన్ని చాలా అట్టహాసంగా చేసుకోవాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. అలా జీవితంలో సెట్ అయిన తర్వాత వివాహం చేసుకోవాలని చాలామంది భావిస్తూ ఉంటారు. అలా వివాహాన్ని ఎక్కువ వయసులో చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది వివాహం చేసుకోవాలని తహతహలాడుతారు.
అయినా వారికి వివాహం కాదు దీనికి ప్రధాన కారణం ఏంటో తెలియక సతమతమవుతుంటారు. అలాంటి వారు ఈ కింద చెప్పిన విధంగా పాటిస్తే వివాహం ఇట్టే అయిపోతుంది.. మనం ఏం చేయాలో చూద్దామా.. వివాహం అస్సలు కావడం లేదని బాధపడేవారు ఆంజనేయ స్వామిని పూజించాలి. ప్రతి మంగళవారం 108 తమలపాకులతో ఆయనకు పూజ చేయాలి.
ఇలా ఎనిమిది మంగళవారాలు పాటు చేస్తే ఆంజనేయ అనుగ్రహం లభించి త్వరగా వివాహం అవుతుంది. శని దోషం కారణంగా వివాహం ఆలస్యం అవుతుందనుకున్న వారు ఇలా చేయాలి. వారు తమలపాకుల్లో తేనె పోసి అనంతరం వాటిని చీమలకు ఆహారంగా పెట్టాలి. దీంతో దోషం నివారణ అవుతుంది. ఫలితంగా వివాహం త్వరగా అవుతుందని పండితులు అంటున్నారు.