వినోదం

ఆర్ఆర్ఆర్ లో ఈ మిస్టేక్ గమనించారా.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు జక్కన్న..?

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిన దర్శకుడు రాజమౌళి. ఇప్పటికే ఆయన బాహుబలి సినిమాతో అనేక రికార్డులు కొల్లగొట్టారు. మళ్లీ ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరును దేశం నలుమూలలా చాటారు. అలాంటి దర్శక ధీరుడు జక్కన్న దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన మూవీ ఆర్ఆర్ఆర్. ఇది థియేటర్ లోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. ఇందులో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ నటించి మెప్పించారు.

have you observed this mistake in rrr movie

ఈ సినిమా ఓటిటిలో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. థియేటర్లో చూసిన ప్రేక్షకులు కూడా మళ్లీ ఈ సినిమాను ఓటిటీలో కూడా అనేక సార్లు వీక్షించారు. అయితే ఈ మూవీని థియేటర్లలో ఉండే హంగామా వల్ల కేవలం సినిమా కథ జోక్స్ మాత్రమే ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. కానీ ఓటీటీలో చూసిన ప్రేక్షకులు మాత్రం సినిమాను నిశితంగా క్లారిటీగా చూస్తారు. ఈ తరుణంలోనే ఆర్ఆర్ఆర్ లోని కొన్ని మిస్టేక్ లను నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ మూవీలో మల్లిని తీసుకువచ్చే సమయంలో ఎన్టీఆర్ బోనులో పులులు, జింకలు తీసుకెళ్తారు. ఈ సమయంలోనే ఓకే బోనులో పులులు మరియు జింకలు తీసుకెళ్లడం ఏంటని చాలామంది ట్రోల్ చేస్తుండగా, నెటిజన్స్ మరో మిస్టేక్ పట్టేశారు.

సినిమాలో రాహుల్ రామకృష్ణ, రామ్ చరణ్ ను మొదటి సారి చూసినప్పుడు పెయింటింగ్ వేస్తూ కనిపిస్తారు. రామ్ చరణ్ ను చూడగానే రాహుల్ పారిపోతాడు. కానీ ఎన్టీఆర్ స్నేహితుడిగా చరణ్ వచ్చినప్పుడు రాహుల్ రామకృష్ణ అతని భుజంపైన చెయ్యి వేస్తాడు. ఆ సమయంలో రాహుల్ వేళ్ళకు ఎలాంటి రంగు కనిపించదు.

కానీ ఎన్టీఆర్ వెళుతున్న వాహనంపై రామ్ చరణ్ అదే రంగులో ఉన్న డిజైన్ చూడగా వెంటనే రాహుల్ రామకృష్ణ చేతి గోళ్లకు ఉన్నటువంటి రంగు గుర్తు చేసుకుంటాడు. అప్పుడు రంగు కనిపిస్తుంది. ఈ మిస్టేక్ గమనించిన నెటిజన్లు మరోసారి రాజమౌళిపై ట్రోల్ చేస్తున్నారు.

Admin

Recent Posts