ఆధ్యాత్మికం

అప్పుల బాధ నుండి బయటపడాలంటే ఎవరికీ పొరపాటున కూడా ఇవి దానం చేయకండి..!

ఒకప్పుడు కోటి విద్యలు కూటి కొరకే అనే సామెత ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేది.. కానీ ప్రస్తుత కాలంలో ఇదంతా మారింది. కోటి విద్యలు డబ్బు కోసమే అన్నట్టుగా మానవుడు అన్ని వదిలి డబ్బు కోసమే పరిగెడుతూ ఉన్నాడు. డబ్బే మనిషిని ఏ విధమైన పనినైనా చేయిస్తుంది. కానీ కొంతమంది డబ్బు సంపాదించాలంటే ఎన్నో సమస్యల పాలవుతున్నారు. ఎంత సంపాదించినా అది మిగలడం లేదని బాధ పడుతున్నారు. ఎవరైనా తమ ఇల్లు ఎప్పుడు డబ్బుకు కొరత లేకుండా, అదృష్టంతో నిండి ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం కఠోర శ్రమతో పాటు పలు చర్యలు కూడా తీసుకుంటారు.

అయితే ఎంత చేసినా మనిషి అనేక విధాలుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అప్పుల బాధ నుండి బయటపడాలంటే ఈ మూడు ఎవరికీ పొరపాటున కూడా దానం చేయవద్దని సూచిస్తున్నారు జ్యోతిష్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ మనిషి జీవితంలోనైనా శుక్ర గ్రహం కీలకమైనది. ఎవరికైనా శుక్రుడి అనుగ్రహం ఉండాలని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. అలాగే శుక్రవారం అనేది భోగభాగ్యాలకు, వైభోగాలకు సంకేతం. అందుకని శుక్రవారం రోజు ఎవ్వరికి డబ్బులు అనేవి ఇవ్వకూడదు. అలా చేస్తే ధనలక్ష్మి మనవద్ద నుంచి వెళ్ళిపోతుందని అంటున్నారు.

do not give these to anybody or else you will not come out of debts

ఒకవేళ శుక్రవారం రోజున ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే.. నేరుగా చేతికి కాకుండా ఏదైనా టేబుల్ పై పెట్టి తీసుకోమని చెప్పాలంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇలా ఒక డబ్బులు మాత్రమే కాదు శుక్రవారం రోజున.. డబ్బులు, ఉప్పు, ఆవాలు, నూనె, నెయ్యి, పెరుగు ఇలా ఏవి నేరుగా చేతికి ఇవ్వకూడదని అంటున్నారు. అలాగే నేరుగా చేతితో తీసుకోకూడని వస్తువుల కూడా ఉన్నాయట. అవేంటంటే.. పెరుగు, నెయ్యి, నూనె, ఉప్పు, ఆయుధాలు, ఇనుము వంటివి ఎవరైనా చేతితో ఇచ్చినప్పుడు నేరుగా చేతితో తీసుకోకూడదట.

Admin

Recent Posts