మనలో చాలామంది ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు లేదా కార్యాలయాలకు వెళ్ళినప్పుడు టాయిలెట్లను చూసే ఉంటారు. పూర్తిగా గమనిస్తే వాటి డోర్లు కాస్త ఖాళీగా కనిపిస్తూ ఉంటాయి. మరి అలా ఖాళీగా ఎందుకు ఉంచుతారు ఇప్పుడు తెలుసుకుందాం. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలో టాయిలెట్ల కింది భాగం ఖాళీ ఉంటుంది. బయటి నుంచి ఒక వ్యక్తి వచ్చి టాయిలెట్లో కూర్చున్న వ్యక్తి ప్యాంటు లాగేయడం ఆ వ్యక్తితో మాట్లాడమనే సన్నివేశాలను సినిమాల్లో చూస్తూ ఉంటాం.
ఇతర దేశాల్లో టాయిలెట్లు ఇలాగే ఉంటాయి. ఇది మన దేశంలో కూడా ఇలా అవలంబిస్తున్నారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. టాయిలెట్ల డోర్ కింది భాగం ఖాళీగా ఎందుకు ఉంటుందో.. ఇప్పుడు చూద్దాం.. ఎవరైనా టాయిలెట్ కి వెళ్లి స్పృహ తప్పి పడిపోయిన, ఫిట్స్ లాంటివి వచ్చిన, గుండెపోటు గురైన వెంటనే వారిని కాపాడడానికి వీలుగా ఈ డోర్ కింద గ్యాప్ ఉంచుతారు.
అత్యవసరంగా వాళ్ళని కాపాడాలంటే ఆ డోర్ పగలగొట్టడం సమస్య అవుతుంది, ఇలా ఖాళీగా ఉంటే వారిని ఈజీగా బయటకి తీయవచ్చు. అంతేకాకుండా ఫ్లోర్ శుభ్రం చేసే క్లీనర్లకు సులువుగా ఉంటుందని ఖాళీగా ఉంచుతారు. అంతేకాకుండా పబ్లిక్ టాయిలెట్స్ ను చాలామంది వినియోగిస్తారు. ఈ క్రమంలో వాసన రాకుండా ఈ విధమైన గ్యాప్ ఉంచుతారు. కొంతమంది టాయిలెట్స్ లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారిని కూడా గుర్తించేందుకు డోర్ కింది భాగంలో ఖాళీ ఉంచుతారు.