ఆధ్యాత్మికం

ఇక్కడ పిల్లలను దేవుడికి ఇచ్చేస్తారు..తర్వాత డబ్బులు పెట్టి కొనుక్కుంటారు..!!

మన భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనం.. ఈ దేశంలో ఎక్కువగా హిందువులే ఉంటారు. హిందూ దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి. హిందూ ధర్మం ప్రకారం జాతకాలు, సాంప్రదాయాలు, నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా హిందువులు దేవున్ని ఆరాధిస్తూ ఉంటారు.. హిందూ దేవుళ్ళలో అనేక మంది ఉన్నారు.. ఒక్కో దేవుని గుడిలో ఒక్క విధమైన సాంప్రదాయం ఉంటుంది.. దాని ప్రకారమే భక్తులు ఫాలో అయి కోరికలు కోరుకొని వివిధ రకాలుగా దేవుడికి కృతజ్ఞత కింద ఏదో ఒకటి సమర్పిస్తూ ఉంటారు..

అలా హిందూ ధర్మం ప్రకారం శ్రీరామనవమి రోజున ఇక్కడ శ్రీరాముని మొక్కితే కోరిన కోరికలు నెరవేరుతాయట. అదేంటో పూర్తిగా తెలుసుకుందాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా గొల్లల మామిడాడ కోదండ రామాలయంలో ప్రతి సంవత్సరం దేవుడికి పిల్లలను ఇచ్చేస్తారు.. తిరిగి వారి పిల్లలను వేలంపాట ద్వారా మళ్లీ వీరే కొనుక్కుంటారు.. శ్రీరామనవమి రోజున తమ కన్న బిడ్డను ఈ విధంగా దేవాలయానికి సమర్పించి, మళ్లీ వీరే కొంత డబ్బులు చెల్లించి ఆ పిల్లలను వెనక్కి తీసుకోవడం కొన్ని ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయం.

devotees give their kids to god in this temple later purchase them

ఇలా దేవుడికి పిల్లల్ని ఇవ్వడాన్ని అమ్మేయడమని వీరు పిలుస్తారు. వారి యొక్క పిల్లల్ని దేవుడికి ఇచ్చేసి మళ్లీ కొనుక్కోవడం వల్ల వారికి మంచి జరుగుతుందని నమ్ముతారు. అంతే కాకుండా ఇక్కడ ఏటా జరిగే సీతారాముల కళ్యాణం లోని తలంబ్రాలను పరమాన్నంగా వండుకొని తింటారని అక్కడి పూజారులు అంటున్నారు. ఈ ఆనవాయితీ 1889 నుంచి కొనసాగుతూ వస్తోందని, ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు లేనివారు మొక్కుకొని పిల్లలు పుట్టాక ఆ పిల్లలను దేవుడికి సమర్పించి మళ్లీ కొనుక్కుంటారని ఆలయ అర్చకులు అంటున్నారు.

Admin

Recent Posts