వారంలో ఉన్న ఏడు రోజుల్లో హిందువులు ఒక్కో రోజు ఒక్కో దేవున్ని పూజిస్తారు. అలానే ఎందుకు చేస్తారంటే… ఆ రోజులంటే ఆయా దేవుళ్లకు ఇష్టం కాబట్టి, ఆ రోజుల్లో పూజలు చేస్తే అనుకున్నవి నెరవేరుతాయని వారు నమ్ముతారు. అందుకు అనుగుణంగానే కొందరు ఆయా రోజుల్లో ఆలయాలకు కూడా కచ్చితంగా వెళ్తారు. అయితే ఇదే కాకుండా, వారంలో ఉన్న ఏడు రోజుల్లో ఒక్కో రోజు కింద చెప్పిన విధంగా చేస్తే దాంతో అనుకున్నవి నెరవేరుతాయట. అంతా శుభమే కలుగుతుందట. ధనం, ఆరోగ్యం సిద్దిస్తాయట. మరి… ఏయే రోజుల్లో ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! ఆదివారం… ఈ రోజున ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తమలపాకు నమలడం లేదా ఆ ఆకులు జేబులో ఉంచుకోవడం చేయాలి. దీంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు.
సోమవారం… సోమవారం మీ ముఖాన్ని అద్దంలో ఒక సారి చూసుకున్నాకే ఇంట్లో నుండి బయటకు రావాలి. వీలైతే కోడి గుడ్డు ఆకారంలో ఉండే అద్దాన్ని ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర అమర్చుకోవాలి. దీంతో అనుకున్నవి నెరవేరుతాయి. మంగళవారం… హనుమంతుడికి ఇష్టమైన రోజిది. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నోరు తీపి చేసుకోవాలి. బెల్లం తింటే మరీ మంచిది. దీంతో సమస్యలు ఎదురుకావు. అనుకున్నవి నెరవేరుతాయి. బుధవారం… బుధవారం రోజున బయటకు వెళ్లేప్పుడు పుదీనా లేదా కరివేపాకు ఆకులు నోట్లో వేసుకోవాలి. ప్రతి బుధవారం ఇలా చేస్తే ఆరోగ్యంగానూ చాలా ప్రయోజనం ఉంటుంది. అనారోగ్య సమస్యలు పోతాయి. గురువారం… గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కొద్దిగా జీలకర్ర లేదా ఆవాలు నోట్లో వేసుకోవడం మంచిది. వాటిని నమల కుండా అలానే నోట్లో ఉంచుకోవాలి. గుమ్మం దాటి బయటకు వెళ్లే వరకూ అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల కోరుకున్నవి జరుగుతాయి. ఏ పని అయినా ఆటంకం లేకుండా పూర్తవుతుంది.

శుక్రవారం… ముఖ్యమైన పనిమీద శుక్రవారం వెళ్లాల్సి వస్తే పెరుగు తిని బయలుదేరాలని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది. అలాగే ప్రతి శుక్రవారం కనీసం రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తీసుకోవాలి. ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుందట. శనివారం… అల్లంతో మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అయితే ప్రతి శనివారం కొద్దిగా అ్లలం తురుము నేతితో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సిరిసంపదలు మీ దరిచేరతాయి. అదృష్టం కలసి వస్తుంది.