ఆధ్యాత్మికం

నిద్రించేట‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు . పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు. విద్యార్థి, నౌకరు, మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో, వీరిని మేల్కొలపవచ్చును. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి. పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు. తడి పాదములతో నిద్రించవద్దు. పొడి పాదాలతో నిద్రించడం వలన లక్ష్మి (ధనం)ప్రాప్తిస్తుంది.

విరిగిన పడకపై, ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య, పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని, మృత్యువు. ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించిన చో ధనము, ఆయువు ప్రాప్తిస్తుంది. పగటిపూటఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసంలో నిద్రిస్తారు. పగటిపూట నిద్ర రోగహేతువు , మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది.

do not make these mistakes while sleeping

పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు. సూర్యాస్తమయానికి ఒక ప్రహారం తరువాత నే పడుకోవాలి. ఎడమవైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది. దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు యముడు మరియు దుష్ట గ్రహముల నివాసము వుంటారు. దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి. గుండెపై చేయి వేసుకుని, చెట్టు యొక్క బీము కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు. పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు. పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు. ఈ నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి, మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు.

Admin

Recent Posts