ఆధ్యాత్మికం

కుబేరున్ని ఇలా పూజించండి.. ల‌క్ష్మీ క‌టాక్షం మిమ్మ‌ల్ని వ‌రిస్తుంది..

ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు లక్ష్మీ అనుగ్రహం కోసం రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి కటాక్షం కోసం భక్తితో అమ్మవారిని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలట. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు లక్ష్మీదేవి మన మీద అలిగిన ఆమెను ఇలా పూజించి తిరిగి ఆమెను ప్రసన్నం చేసుకోవచ్చట. ఇప్పుడు ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం.

do pooja to kubera like this for lakshmi kataksham

ఓం యక్షాయ కుబేరాయా.. వైశ్వనాయ.. ధనధాన్యాది పతయే. ధనధాన్య సమృద్ధి మి దేహీ దాపయా స్వాహా

ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పొద్దున్నే లేచాక మీ పనులన్నింటిని ముగించుకుని తలస్నానం చేసి చెక్క పీఠం మీద లక్ష్మీదేవి, కుబేరుడు ఉన్న పటం పెట్టాలి. అది ఉత్తర దిశగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఒక నెయ్యిఒత్తిని వెలిగించి ధూపం వెయ్యాలి. పూజ చేస్తూ గణపతి దేవుడిని ప్రార్థించాలి. తర్వాత ఆసనంలో కూర్చుని 108 సార్లు మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే కుబేరుడు ధనప్రాప్తి ఇస్తాడు. అలాగే చెక్క పీఠం మీద ఏడు గవ్వలను పెట్టి పూజిస్తే ఇంకా త్వరగా ధనప్రాప్తి లభిస్తుందని విశ్వాసం.

Admin

Recent Posts