ఆధ్యాత్మికం

వినాయ‌కున్ని ఇలా పూజిస్తే మీకు ఎందులోనూ తిరుగుండ‌దు.. అన్ని స‌మ‌స్య‌లు పోతాయి..

ఒక్కో రోజు దేవుడికు ప్రత్యేకం..బుధవారం అంటే వినాయకుడికి ఇష్టమైన రోజు..ఆయనను భక్తి, శ్రద్దలతో పూజిస్తే మనం అనుకున్న కోరికలు ఇట్టే నెరవేరుతాయని జ్యోతిష్కులు చెబుతున్నారు.అసలు బుధవారం వినాయకుడికి ఎలాంటి పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బుధవారం గణపతికి గరిక పూజ చేయడం వలన శని బాధలు తొలగిపోతాయి. గణపతికి బుధవారం గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనైశ్చరుని వలన కలిగే ఈతిబాధలు, సమస్యల నుంచి బయట పడతారు. శనిభగవానుడిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాటి శని, అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి. గరిక పత్రంతో శ్రీ మహా గణపతికి పూజ చేసి తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి.

do pooja to lord ganesha like this on wednes day for wealth

గరిక పత్రాన్ని నగదు ఉంచే ప్రదేశంలో పెడితే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చేస్తుంది. దుర్గాదేవికి గరికతో పూజ చేస్తే రహస్య ప్రార్థనలు ఫలిస్తాయి. గరికను దారంతో కట్టి గణపతికి మాల వేస్తే మీ మనోగతమైన అన్ని రకాల కోరికలు పూర్తిగా నెరవేరుతాయి. ఇది చాలా సులభమైన ఉపాయం. దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టనక్కర్లేదు. చాలా సులభంగా మనకు లభించే గరికతో గణేష్డుని ఆరాధించి అతి శ్రీఘ్రంగా శనిబాధల నుంచి విముక్తి పడవచ్చు.ఇలా చాలా మంది చేసి మంచి ఫలితాలను పొందారు..మీరు కూడా వినాయకుడిని భక్తితో పూజించి ఆయురారోగ్య,ధన ప్రాప్థిని పొందండి.

Admin

Recent Posts