ఆధ్యాత్మికం

మంగ‌ళ‌వారం నాడు హ‌నుమంతున్ని ఇలా పూజించండి.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..

హిందూ పురాణాల ప్రకారం మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు..మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా భయభ్రాంతులు తొలగిపోయి , మనోధైర్యాన్ని ప్రసాదిస్తాడని ప్రజల నమ్మకం..అంతేకాకుండా నిద్రలో వచ్చే పీడకలలు నుంచి విముక్తి పొందడానికి ఆంజనేయ స్తోత్రం పఠించడం ద్వారా పీడకలల నుంచి విముక్తి పొందవచ్చు.ఆంజనేయ స్వామి శక్తికి, బలానికి ప్రతీక కనుక స్వామి వారిని మంగళవారం ఏ విధంగా పూజించడం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వామివారిని భక్తిశ్రద్ధలతో ఎర్రని సింధూరం తో పూజించాలి. స్వామివారికి ఎరుపురంగు అంటే ఎంతోఇష్టం కనుక ఆరోజున ఎరుపురంగు పువ్వులతో పూజించాలి.అలాగే స్వామివారికి నైవేద్యంగా కేసరిని సమర్పించాలి.అలాగే మంగళవారం స్వామివారిని పూజించే స్త్రీలు ఎరుపు రంగు దుస్తులను ధరించి, ఎరుపు రంగు పువ్వులను పెట్టుకోవాలి… ఎరుపు అంటే ఆయనకు ఎంత ఇష్టమో తెలుసు..

do pooja to lord hanuman like this on tuesday for all wishes

ఇకపోతే సుమంగళి స్త్రీలు నుదటన ఎల్లప్పుడు కుంకుమ ధరించి పూజ చేయడం వల్ల స్వామివారి దీర్ఘసుమంగళీ ప్రాప్తం కలగడమే కాకుండా, అనుకున్న కోరికలు నెరవేరుతాయి.మంగళవారం స్వామివారికి నాగవల్లి దళాలతో పూజ చేయడం ఎంతో శుభకరం.నాగవల్లి దళాలు అంటే తమలపాకులు. తమలపాకులకు మరోపేరు నాగవల్లి దళాలని అంటారు..ఈ పత్రాలతో స్వామివారికి పూజిస్తే నాగ దోషం, ప్రాణ గండం ఉన్న తొలగిపోతాయి..ఈ దళాల హారంతో స్వామివారికి పూజించటం ద్వారా సకల పాపాలు, దోషాలు తొలగిపోతాయి.మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించిన తర్వాత హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మనం ఎదుర్కొనే సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు…కోరికలు కూడా నెరవేరుతాయని భక్తుల నమ్మకం..

Admin

Recent Posts