ఆధ్యాత్మికం

తిరుమల శ్రీవారి ప్రసాదాలు ఏంటో తెలుసా? శ్రీవారికి సమర్పించే నైవేద్యాన్ని ఎవ్వరూ చూడకూడదు అంటారు ఇది నిజమేనా.??

తిరుమల శ్రీవారి ప్రసాదం అంటే అందరికి వెంటనే గుర్తొచ్చేది లడ్డు. తిరుపతి లడ్డూ అంటే ఇష్టపడని వారుండరు. కానీ శ్రీ వారికి లడ్డుతో పాటు వడ, పొంగలి, దోసెలు వంటివి కూడా సమర్పిస్తారని తెలుసా. శ్రీవారికి ప్రసాదాలన్నీ ఆగమ శాస్త్రం ప్రకారమే సమర్పిస్తారు. చక్కెర పొంగలి, పెరుగన్నం లాంటివి కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారమే ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది.

ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే ఉపయోగిస్తారు. పాలుగారే చెట్ల కొమ్మలు, ముళ్ల చెట్లుగానీ వంటకు వినియోగించరు. ప్రసాదం వండేవారు వంట సమయంలోగానీ, తర్వాతగానీ వాసన చూడరు. శ్రీవారికి సమర్పించేంతవరకు ఆ ప్రసాదాన్ని ఎవ్వరూ చూడకూడదు. ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధి చేస్తారు. నైవేద్యం సమర్పించే సమయంలో గర్భాలయం తలుపులు మూసివేసి కేవలం అర్చకుడు మాత్రమే ఆలయంలో ఉంటారు. విష్ణు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ప్రసాదాల మీద నెయ్యి, తులసీ చల్లుతారు.

do you know these facts about tirumala prasadam and naivedyam

కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడి చేతికి దానిని తాకించి, నోటి దగ్గర తాకుతారు. నైవేద్యం సమర్పించేంత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. ఇది స్వామికి భోజనానికి పిలుపుగా దీనిని భావిస్తారు. స్వామికి రోజు మూడు పూటల నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్వ కేసరి, మధ్యాహ్నం శుద్ధాన్నం, పులిహోర, గూడాన్నం, దద్యోజనం, శీర లేక చక్కెరన్నం.. రాత్రిపూట మిరియాల అన్నం, దోసె, లడ్డూ, వడ, శాకాన్నం సమర్పిస్తారు.

Admin

Recent Posts