ఆధ్యాత్మికం

మొలతాడు ఎందుకు కడతారో తెలుసా..?దీని వెనుక సైన్స్ ఏంటి అంటే.??

హిందూ సాంప్రదాయంలో ప్రతీది సైన్స్ తో ముడిపడి ఉంటుంది. మనం ధరించే ప్రతీ వస్తువు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయంటారు మన పెద్దలు. ఇక మొలతాడు వెనుక కూడా సైన్స్ ఉందంటున్నారు అదేంటో ఇప్పుడు చూద్దాం. సనాతనధర్మం ప్రకారం ప్రతి వ్యక్తికి జీవితంలో 16 సంస్కారాలు నిర్వహించాలి. ఇవి పుట్టుకముందు నుంచి మరణం తర్వాతి వరకు ఉంటాయి. వీటిలో ఒకటి జాతకర్మ. ఇది బిడ్డ పుట్టిన తర్వాత 11 రోజులకు చేసే సంస్కారం. పూర్వం ఈ సమయంలోనే బొడ్డుతాడును తీసి, మంత్రించి, రాగి తాయత్తులో చుట్టి భద్రపరిచేవారు. ఆ రాగి తాయత్తును వెండితో చుట్టిన మొలతాడుకు కట్టేవారు.

లోహాలకు శరీరంపై ప్రభావం చూపే శక్తి ఉందని గుర్తించారు. ఎప్పుడైతే మొలకు వెండి మొలతాడు కట్టు కుంటామో, అప్పుడు ఆ లోహప్రభావం వలన ఆ శరీర ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత సాధారణస్థాయికి రావడం కానీ, అదుపులో ఉండటం కానీ జరుగుతుంది. అయితే వెండిమొలతాడు కొనే స్థోమత లేకపోవడం చేతనో, లేక అది అనాగరికమని భావించటం చేతనో, ఇప్పుడు కేవలం వెండి తాయత్తులో బొడ్డుతాడు ఉంచి, మొలతాడుకు కడుతున్నారు.

do you know why men should wear waist thread

చిన్న పిల్ల‌ల‌కు మొల‌తాడు క‌డితే వారు ఎదుగుతున్న స‌మ‌యంలో ఎముక‌లు, కండ‌రాలు స‌రైన ప‌ద్ధ‌తిలో వృద్ధి చెందుతాయి. ప్ర‌ధానంగా మ‌గ పిల్ల‌ల్లో పెరుగుద‌ల స‌మ‌యంలో పురుషాంగం ఎటువంటి అస‌మ‌తుల్యానికి గురికాకుండా క‌చ్చిత‌మైన పెరుగుద‌ల ఉండేందుకు మొల‌తాడును క‌డ‌తారు.

మొల‌తాడు క‌ట్టుకుంటే ర‌క్త ప్ర‌స‌ర‌ణ కూడా మెరుగు ప‌డుతుంది. మ‌గ‌వారికి హెర్నియా రాకుండా మొల‌తాడు కాపాడుతుంది. దీన్ని ప‌లువురు సైంటిస్టులు కూడా నిరూపించారు. మ‌న ద‌గ్గ‌ర చిన్న పిల్ల‌ల‌కు ఎక్కువ‌గా వెండితో చేసిన మొల‌తాడును క‌ట్ట‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయితే ఎలాంటి మొల‌తాడు క‌ట్టినా దాంతో మాత్రం మనకు ఉప‌యోగ‌మే.

Admin

Recent Posts