ఆధ్యాత్మికం

మీకు న‌ర దిష్టి త‌గ‌లొద్దు అనుకుంటే ఇలా చేయండి..!

ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండాలని అనుకుంటారు కానీ ఒక్కొక్క సారి మన మీద చెడు ప్రభావం పడొచ్చు. నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది. ఈ విషయాన్ని మీరు చాలా సార్లు వినే ఉంటారు. అయితే ఇటువంటి సమస్యలు ఏమి కలగకుండా ఉండాలంటే ఇలా చేయండి మామూలుగా మనం గణపతిని పూజిస్తూ ఉంటాము గణపతిని పూజించడం మంచిదే అయితే కీడు చెడు దృష్టి వంటిది పోవాలంటే మాత్రం మనం ఈ విధంగా చేయాల్సిందే.

మామూలుగా ఎవరైనా చూస్తే ఎవరికీ కూడా ఏమీ జరగదు కానీ ద్వేషం ఈర్ష్య తో కనుక ఎవరైనా చూస్తే చెడు దృష్టి కలుగుతుంది మనకి హాని కలుగుతుంది. చెడు దృష్టి తాకే మనిషినైనా లేదంటే ఇక దేనినైనా చూస్తే మాడి మసి చేస్తుంది దిష్టి దుష్ప్రభావాన్ని అణచివేయడానికి ఒక మందు కూడా ఉండదు కాబట్టి ఇలా ఆచరించడం మంచిది.

follow this remedy if you do not want nara dishti

అశుభ దృష్టి తగలకూడదు అంటే శుభదృష్టి గణపతిని ఇంట్లో పెట్టుకోండి శుభదృష్టి గణపతి ఇంట్లో పెట్టడం వలన చక్కటి ఫలితం ఉంటుంది శుభ దృష్టి గణపతి ఇంట్లో పెట్టడం వలన దిష్టి బాధలు వంటివి ఏమీ కూడా ఉండవు శుభదృష్టి గణపతిని పూజిస్తే కూడా మంచిది ఇంట్లో మీరు శుభదృష్టి గణపతిని పెట్టి పూజించ వచ్చు లేదంటే ఆఫీసు ఫ్యాక్టరీలు లేదంటే ఇంకా ఎక్కడైనా పనిచేసే చోట కూడా ఈ గణపతిని పెట్టి ఆరాధించొచ్చు.

Admin

Recent Posts