ఆధ్యాత్మికం

రామ‌ప్ప ఆల‌య శిల్ప క‌ళా సౌంద‌ర్యం.. వ‌ర్ణించ‌న‌ల‌వి కానిది.. ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలంగాణ రాష్ట్రంలోని à°µ‌రంగ‌ల్ జిల్లాలో ఉన్న రామ‌ప్ప దేవాల‌యానికి యునెస్కో గుర్తింపు à°µ‌చ్చిన సంగ‌తి తెలిసిందే&period; దీంతో ప్ర‌తి ఒక్క‌రూ ఈ ఆల‌యం గురించి తెలుసుకునేందుకు&comma; ఆల‌యాన్ని సంద‌ర్శించేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు&period; ఈ ఆల‌యాన్ని కాక‌తీయరాజులు నిర్మించారు&period; హైద‌రాబాద్‌కు 157 కిలోమీట‌ర్ల దూరంలో&comma; à°µ‌రంగ‌ల్‌కు 70 కిలోమీట‌ర్ల దూరంలో&period;&period; ములుగు జిల్లా&comma; వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఈ ఆల‌యం ఉంది&period; దీన్నే రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆల‌యం చాలా ప్రాముఖ్యత గల దేవాలయం&period; ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా నిలుస్తుంది&period; ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది&period; ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది&period; ఇది ఇప్పటికీ వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది&period; పాలంపేట చారిత్రత్మాక గ్రామం&period; కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది&period; కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించిన‌ట్లు తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64605 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;ramappa-temple&period;jpg" alt&equals;"have you seen ramappa temple beauty " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎనిమిది శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా రావ‌డం నిజంగా గ‌ర్వ‌కార‌à°£‌మే&period; ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం&comma; నీటిలో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని నిర్మించడం&comma; ఆలయ నిర్మాణానికి వాడిన రాతి నేటికీ రంగును కోల్పోకుండా ఉండడం వంటివి ఈ ఆల‌à°¯ ప్ర‌ధాన‌ విశిష్ట‌à°¤‌లుగా చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం రామప్ప జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది&period; ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు &lpar;రుద్రయ్య&rpar; కట్టించాడు&period; మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం&period; ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు&period; ఈ దేవాలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు&period; విష్ణువు అవతారం రాముడు&comma; శివుడు కలిసి ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-64603" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;ramappa-temple-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆలయ నిర్మాణంలో కాక‌తీయుల శైలి స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది&period; ఆరు అడుగుల ఎత్తైన à°¨‌క్ష‌త్ర మండ‌పంపై ఆల‌యాన్ని నిర్మించారు&period; ఈ ఆలయం తూర్పు దిక్కుగా ఎత్తైన వేదికపై గర్భాలయం&comma; అంతర్భాగంలో మూడు వైపులా ప్రవేశ ద్వారం గల మహామండపం ఉంటాయి&period; గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంటుంది&period; దీంట్లో మహామండపం మధ్య భాగంలో గ‌à°² కుడ్య స్థంభాలు&comma; వాటిపై ఉండే రాతి దూలాలు రామాయణ&comma; పురాణ&comma; ఇతిహాస గాథ‌లతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పాల‌ను కలిగి ఉంటాయి&period; ఈ మహా మండపం వెలుపలి అంచున పై కప్పు కింది భాగంలో నల్లని నునుపు రాతి à°«‌లకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదనిక&comma; నాగిని శిల్పాలు ఉంటాయి&period; ఇవి కాకతీయుల శిల్ప కళాభిరుచులకు చక్కటి తార్కాణాలుగా చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ దేవాలయ ప్రాంగణంలో నంది మండపం&comma; కామేశ్వర&comma; కాటేశ్వర మొదలగు ఆలయాలు చూడదగినవి&period; దేవాలయం శిల్ప సంపదలో కాకతీయ రాజుల నాటి శైలి క‌నిపిస్తుంది&period; దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైంది&period; ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవ‌ని చెబుతారు&period; ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది&period; ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని&comma; చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా&quest; అన్నట్లుంటుంది&period; ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-64604" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;ramappa-temple-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థంబాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి&period; మండపం పైకప్పు మీద శిల్ప కళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది&period; లోపల రెండు శివుడి సన్నిధులు ఉన్నాయి&period; శివుడి వైపు చూస్తున్న నంది చాలా అందంగా చెక్కబడి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం&comma; శిల్ప నైపుణ్యం వర్ణించనలవికానివి&period; ఈ కాకతీయ శిల్ప చాతుర్యమంతా&comma; ఇన్నేళ్ళు గడిచినా ఈ నాటికీ చూప‌రులకు అమితానందాన్ని కలిగిస్తుంది&period; à°­à°°à°¤ నాట్య శాస్త్రమంతా మూర్తీభవించి స్థంబాలమీదా&comma; కప్పులమీదా కనబడుతుంది&period; రామప్ప గుడిలోని విగ్రహాలు&comma; స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్ల రాతి నాట్యగ‌త్తెల విగ్రహాలు అతి సుందరమైనవి&period; ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణ‌లు&comma; వాటి త్రిభంగి నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తాయి&period; దేవాలయంలోని స్థంబాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యాల వారిగా రేఖలు చిత్రించబడి ఉన్నాయి&period; జాయన సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదాహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-64602" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;ramappa-cheruvu&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు&comma; దాడులకు&comma; ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది&period; దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదలి వేయడం వల్ల‌ అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి&period; కొంత మంది ఇక్కుడున్న నీళ్ళపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు&period; అప్పటినుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తోంది&period; ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది&period; కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం క‌ల్పిస్తున్నారు&period; ప్ర‌తి ఏటా మహాశివరాత్రి ఉత్సవాల‌ను 3 రోజులపాటు ఘ‌నంగా నిర్వ‌హిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts