ఆధ్యాత్మికం

నరదిష్టి ఉందా..అయితే ఇలా చేస్తే చాలు అంతా మాయం..!!

హిందూ సాంప్రదాయం ప్రకారం చాలామంది దిష్టి దోషాలు నమ్ముతారు. ముఖ్యంగా నరదిష్టి అనేది అతి ప్రమాదకరంగా భావిస్తారు. ఈ నర దిష్టి వల్ల అనారోగ్య సమస్యలు వ్యాపారాలు కలిసి రాకపోవడం, కుటుంబ కలహాలు వంటివి వస్తూ ఉంటాయి. అలాంటి నరదిష్టి పోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్యులు అంటున్నారు.. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ముఖ్యంగా నరదిష్టి ఇంటిపై పడకుండా ఉండాలి అంటే ఇంటి గుమ్మం ముందు బూడిద గుమ్మడికాయ కట్టుకోవాలి. నరదిష్టి మన ఇంటి మీద పడకుండా అది కాపాడుతుంది. దీన్ని మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. అంతేకాకుండా అది కూడా బుధవారం రోజు అయితే శుభంగా ఉంటుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వారు మళ్ళి లోపలికి వచ్చేటప్పుడు కాళ్లు కడుక్కుంటే మంచిది. లేదంటే దుమ్ము ధూళి కాళ్లతో పాటు ఇంట్లోకి ప్రవేశించడం వల్ల చెడు ఫలితాలు ఉంటాయి.

if you have nara dishti follow these remedies

అలాగే నర దృష్టి పోవడానికి ఒక గిన్నెలో రాళ్లు ఉప్పు పసుపు వేయాలి. గిన్నెలో వీటిని వేసుకొని చేత్తో పట్టుకుని నరదృష్టి తొలిగిపోవాలని మనసులో అనుకుంటూ ఇంట్లో ఉండే ప్రతి మూల తిరగాలి.ఆ తర్వాత వీటిని ఒక మూలలో ఉంచాలి. ఇక తెల్లవారి జామున ఇంటి ప్రధాన ద్వారం తీయకుండా ఇంటి వెనుక ద్వారాన్ని తీయాలి. దీనివల్ల నరదృష్టి తొలిగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

Admin

Recent Posts