ఆధ్యాత్మికం

కలలో కనిపించే ఈ జంతువుల‌కు అర్థం ఏమిటో తెలుసా..?

కుందేలు అదృష్టానికి గుర్తు. మీ భవిష్యత్తు ప్రయత్నాలు మీకు అనుకూలంగా తిరుగుతాయని అర్ధం. తెల్ల కుందేలు నిజమైన ప్రేమకు సూచన. పచ్చిక బయళ్ళలో దూకుతూ, ఆడుకుంటున్న కుందేళ్ళు పిల్లల వలన కలగబోయే సంతోషాన్ని సూచిస్తాయి. లేడి దయ, సౌమ్యత, సహజ అందానికి గుర్తు. ఇది మీలోని సున్నిత భావాలకు సూచన. నల్ల లేడి కనిపిస్తే, మీరు మీలోని సున్నిత భావాలను తిరస్కరిస్తున్నట్లు. లేడిని చంపుతున్నట్లు కల వస్తే మీలోని సున్నిత భావాలను, ఇంకా దయ, సౌమ్యతను అణిచివేయటానికి ప్రయత్నిస్తున్నట్లు అర్ధం. కలలో ఏనుగు కనిపిస్తే, మీరు ఇతరుల పట్ల ఇంకా. ఎక్కువ అవగాహనతో, సహనంతో ఉండాలని అర్ధం. ఏనుగు శక్తి, బలం, తెలివికి చిహ్నం. అంతేకాక, ఇది మీలోని అంతర్ముఖ వ్యక్తిత్వానికి సూచన కావచ్చు. ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్లు కల వస్తే, మీరు ఒకప్పుడు భయపడిన, మీలోని దాగబడిన అంశాలు మీ నియంత్రణలో ఉన్నాయని అర్ధం.

మేక పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోవటాన్ని, అవివేకాన్ని సూచిస్తుంది. మేకపోతు కనిపిస్తే, మీ పోటీదారులు మీవ్యాపారాలను కూల్చివేయటానికి ప్రయత్నిస్తున్నారని అర్ధం. గుర్రం బలమైన భౌతిక శక్తికి సూచన. నల్ల గుర్రం హింస, క్షుద్ర శక్తులకు, తెల్ల గుర్రం స్వచ్ఛత, శ్రేయస్సు అదృష్టానికి సూచన. చనిపోయిన గుర్రం ఒకప్పుడు మీకు బలం కలిగించింది ఏదో మీ జీవితంలోనుండి పోయిందని, ఇప్పుడు లేదనే దానికి సూచన. అడవి గుర్రాలమంద బాధ్యతా రాహిత్యానికి గుర్తు. గుర్రం మీద స్వారీ చేస్తూ అది మీనియంత్రణలో ఉంటే, అక్రమ మార్గాల ద్వారా విజయం సాధించడానికి ప్రయత్నిస్తారని, నియంత్రణలోలేని గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటే, మీ కోరికలు మిమ్మల్ని స్థిమితంగా ఉండనీయవని అర్ధం. ఎక్కువమందికి కలలో కనిపించే జంతువులలో పాము కూడా ఒకటి. పాము ప్రమాదకరమైన, నిషిద్ధ లైంగికతకు ప్రతీక. కలలో పాము కాటు వేస్తే మీలో దాగబడ్డ భయాలు, ఆందోళనలు ఉన్నాయని, అవి మిమ్మల్ని బాగా భయపెడుతున్నాయని అర్ధం. ఇది మీరు నిజజీవితంలో ఎదుర్కోబోయే ప్రమాదానికి సూచన కావచ్చు. కలలో పాము తరుముతుంటే, మీరు వద్దనుకుంటున్న పరిస్థితిలోనే మీరు చిక్కుకోవాల్సి వచ్చిందని, లేక వస్తుందని అర్ధం.

if you see these animals in your dreams then know the meaning

పంది మురికి, అత్యాశ, స్వార్ధానికి గుర్తు. మీలో ఉన్న స్వార్ధాన్ని లేక అత్యాశను వదిలించుకుంటే కానీ విజయావకాశాలు దరి చేరవని అర్ధం. గొర్రె ప్రయత్నలేమిని, చొరవలేనితనాన్ని సూచిస్తుంది. సృజనాత్మకతను పెంచుకొని, కొత్త మార్గాల్లో వెళ్ళటానికి మీరు మొగ్గు చూపరని, నలుగురితోపాటు నారాయణా అనటానికే ఇష్టపడతారని అర్ధం. సింహం బలానికి, దూకుడుకి, శక్తికి ప్రతీక. మీరు ఇతరులపై ఎక్కువ ప్రభావం చూపుతున్నారని, ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగించాలంటే దీనిని నియంత్రించవలసిన అవసరం ఉందని అర్ధం. సింహం మీపై దాడి చేసినట్లు కల వస్తే, మీరు ఎన్నో అడ్డంకులను అధిగమించవలసిన అవసరం ఉందని సూచిస్తుంది. పులి శక్తికి, వివిధ పరిస్థితులను ఎదుర్కోవటానికి కావలసిన మీ సామర్థ్యానికి, నాయకత్వ లక్షణానికి సూచన. బోనులో ఉంచబడిన పులి అణచివేయ్యబడిన భావోద్వేగాలకు, దాడి చేస్తున్న పులి, ఆ భావోద్వేగాల వల్ల కలిగే భయానికి గుర్తు. తాబేలు మీరు జీవితంలో ముందుకు పోవడానికి అవకాశాలు వెతుక్కోవలసిన అవసరాన్ని సూచిస్తుంది. మీకు ఎదగటానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి, కానీ దాని కోసం సరి అయిన అడుగు వేయాలని అర్ధం.

Admin

Recent Posts