ఆధ్యాత్మికం

శ‌నివారం నాడు ఇవి మీకు క‌నిపిస్తే మీకు శ‌నిదేవుడి అనుగ్ర‌హం క‌లుగుతుంది..!

శనివారం రోజున ఈ విధంగా చేస్తే శనీశ్వరుడి ఆశీస్సులు పొందొచ్చు. శనీశ్వరుడి అనుగ్రహం మనకి కలుగుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం శని దేవుడిని న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు. శని భగవానుని చూసే చాలా మంది భయ పడిపోతూ ఉంటారు శని దేవుడు ఎవరు చేసిన కర్మలను బట్టి వారికి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. శిక్షలు కూడా వేస్తూ ఉంటాడు శనివారం రోజున వీటిలో ఏ వస్తువునైనా చూస్తే శని దేవుడి అనుగ్రహం కలుగుతుంది అని అర్థం.

శనివారం రోజున తెల్లవారుజామున బిక్షగాడిని చూసి ఏమైనా దానం చేస్తే మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. మీకు శని దేవుడు ప్రసన్నమయ్యాడని అది సూచిస్తుంది. అలానే శనివారం నాడు చెత్త ఊడ్చే వ్యక్తులను చూసినా కూడా అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. శనివారం నాడు నల్ల కుక్క కనబడితే అది చాలా మంచిది అలా మీకు కనపడిన నల్ల కుక్క కి ఏదైనా ఆహారం పెట్టండి.

if you see these on saturday lord shani will give you blessings

అప్పుడు శని దేవుని అనుగ్రహం కలుగుతుంది శనివారం నాడు ఇంటి ఆవరణలో కాకి నీరు తాగడానికి వచ్చినా లేదంటే ఇంటి ముందు ఉన్న నీటి ని తాగినా కూడా అది శుభ సూచకం. శనివారం నాడు ఏదైనా ముఖ్యమైన పని చేయడానికి మీరు వెళ్తున్నట్లయితే దారిలో నల్ల ఆవు కనబడితే ఆ పని కచ్చితంగా పూర్తవుతుంది. అలానే నల్ల ఆవుని దానం చేస్తే కూడా చక్కటి ఫలితాలను పొందొచ్చు.

Admin

Recent Posts