ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

కాకుల అరుపులు మంచిది కాదని అంటారు. అందుకే కాకి అరుపు చెడు శకునంగా భావిస్తారు. కాకులు మన ఇంటి ముందుకు వచ్చి అరిస్తే మన జీవితంలో ఏదో చెడు ఘటన జరగబోతుందని సంకేతంగా భావిస్తారు. కానీ, కొన్ని సమయాల్లో కాకుల అరుపు ధనలాభాన్ని సూచిస్తుంది. సూర్యోదయ సమయంలో కాకుల అరుపులను శుభప్రదంగా భావిస్తారు. ఇది మీ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి రాబోతోందనడాన్ని సూచిస్తుంది. ఇది త్వరలోనే మీకు సంపద కలిగిస్తుందనే సూచనగా జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సును కూడా పెంచుతుందని అంటున్నారు.

ఇంటి ఆవరణలో లేదా ఇంటి పై కప్పుపై కాకి అరిస్తే.. మీ ఇంటికి చుట్టాలు రాబోతున్నారన్న సంకేతంగా చెబుతారు. అతిథుల రాకను శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే మన దేశ సంప్రదాయంలో అతిథులను లక్ష్మీ రూపంగా భావిస్తారు. అతిథి రాక మీ ఇంటికి సంతోషాన్ని, అదృష్టాన్ని తెస్తుంది. కాకి అకస్మాత్తుగా గట్టి గట్టిగా అరిచిన.. ఈ అరుపులు ఎక్కువ సేపు ఉన్నా.. అది బాధకు లేదా సంక్షోభానికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఇలాంటి పరిస్థితిలో కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.. ఎందుకంటే ఇది అశుభ ఘటనను సూచిస్తుంది.

is crow frequently coming to your home then know the meaning

మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా సమీపంలో కాకి పదేపదే అరిస్తే అది సమీప బంధువు మరణానికి సంకేతంగా పరిగణించబడుతుంది. శకున శాస్త్రంలో దీన్ని ప్రమాదకరంగా భావిస్తారు. కాకులు పదేపదే అరవడం వల్ల ఇంట్లో వివాదాలు, కలహాలు, గొడవలకు సంకేతంగా భావిస్తారు.

Admin

Recent Posts