ఆధ్యాత్మికం

స్త్రీల‌కు, పురుషుల‌కు బ‌ల్లి ఏ భాగంపై ప‌డితే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి..?

బల్లులు ఎక్కువగా ఇళ్ళల్లో కనిపిస్తుంటాయి. చిన్నచిన్న పురుగులు తిని బల్లులు బతుకుతుంటాయి. బల్లి విష పురుగుగా చెబుతుంటారు. బల్లి కరువకపోయినా, బల్లి పడిన ఆహారాన్ని తీసుకుంటే దాన్ని విషాహారంగా చెబుతుంటారు. అప్పుడప్పుడు బల్లి మన మీద పడ్డటప్పుడు కానీ, మీద పాకుతూ వెళ్ళినప్పుడు లేదా మనల్ని తాకినప్పుడు భవిష్యత్తులో ప్రమాదమని పెద్దలు చెబుతుంటారు. మగవారి తలపై బల్లి పడితే మరణం వెంటాడుతుందని సంకేతం. ముఖంపై పడితే ఆర్థిక సమస్యల నుంచి బయట పడి లాభాల బారిన పడతారు. ఎడమ కన్నుపై పడితే అంతా శుభమే జరుగుతుంది. కుడి కన్నుపై పడితే చేసే పని విజయవంతం కాదు. అపజయం కలుగుతుంది. నుదురుపై పడితే ఇతర సమస్యలు రావడం, విడిపోవడం లాంటివి జరుగుతుంది.

కుడి చెంపపై పడితే బాధలు ఎక్కువవుతాయి. ఎడమ చెవిపై పడితే ఆదాయం బాగా వస్తుంది. పైపెదవి అయితే కలహాలు వెంట పడతాయి. కింది పెదవి ఆదాయంలో లాభం కలుగుతుంది. రెండు పెదవుల మధ్య పడితే మృత్యువు సంభవిస్తుంది. వీపుపై ఎడమ భాగం విజయం కలుగుతుంది. మణికట్టు అలంకార ప్రాప్తి కలుగుతుంది. మోచేయి డబ్బు నష్టం. వేళ్ళపై పడితే అనుకోకుండా బంధువులు, స్నేహితుల రాక, కుడి భుజం కష్టాలు, సమస్యలు. ఎడమ భుజం పదిమందిలో అవమానం జరుగుతుంది. తొడలపై దుస్తులు, వస్త్రాలు నాశనమవుతాయి. మీసాలపై పడితే కష్టాలు వెంటాడుతాయి. కాలి వేళ్ళపై అయితే అనారోగ్య సమస్యలు. పాదములపై అయితే ప్రయాణానికి సిద్ధం. ఇది పురుషులకు.

lizard fell on body parts which result it will give

ఇక స్త్రీలపై బల్లి పడితే… తలపై మరణ భయం, కొప్పుపై రోగాల భయం, పిక్కలపై బంధువుల రాక, ఎడమ కన్ను భర్త వేరొకరి ప్రేమను పొందుతారట, కుడి కన్ను మనోవ్యధ, రొమ్ము (వక్షస్ధలం) మంచి జరుగుతుంది, కుడి చెంప మగ శిశువు జన్మిస్తాడని, కుడి చెవి ధనలాభం.. ఆదాయం, పై పెదవి విరోధములు కలుగుతాయి, కింది పెదవి కొత్త వస్తువులు మీ చెంతకు చేరుతాయి, రెండు పెదవులపై పడితే కష్టాలు, సమస్యలను ఫేస్ చెయ్యాలి. వీపు పైన పడితే మరణవార్తను వింటారు.. గోళ్ళపై పడితే చిన్నచిన్న కలహాలు గొడవలు.

ఎడమ చేయిపైన పడితే మెంటల్ స్ట్రెస్, వేళ్ళపై పడితే నగల ప్రాప్తి. కుడిభుజం కామరతి ప్రాప్తి కలుగుతుంది, తొడలు- కామము, మోకాళ్ళు ఆదరణ, అభిమానం, చీలమండలము కష్టాలు, కుడి కాలు గొడవలు, కాలివేళ్ళు పుత్రుడు జన్మిస్తాడు.

Admin

Recent Posts