ఆధ్యాత్మికం

పిల్ల‌లు వీరికి పూజ‌లు చేస్తుంటే చ‌దువు బాగా వ‌స్తుంది.. తెలివితేట‌లు పెరుగుతాయి..!

లోకంలో తమ పిల్లలకు విద్యబాగా రావాలని కోరుకోని తల్లిదండ్రులు ఉండరు. చదువులో అగ్రస్థానం చేరుకోవాలని చేయించని పూజలు ఉండవు. ప్రదక్షిణలు, ఉపవాసాలు, దానాలు, ధర్మాలు, హోమాలు ఇలా ఎన్నో విన్యాసాలు. తమ చేతిలోనే ఉండే పలు కీలక విషయాలను తెలుసుకోకుండా ఎవరు ఏది చెపితే దాన్ని ఆచరించడం పరిపాటిగా మారింది. దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికే అన్న భావన నుంచి మొదలు బయటకు రావాలి. అనంత విశ్వాన్ని శాసిస్తూ పరిపాలిస్తున్న ఆ తల్లి కృప ఉంటే అన్ని వస్తాయి. అయితే ధర్మబద్ధమైన కోరికలు తప్పుకాదు. కాబట్టి ఎవరికి వారు తమ పిల్లలు మంచిగా చదువుకోవాలని ఆకాంక్షించడం అంతకన్నా తప్పుకాదు. దీనికోసం పెద్దలు, వేదవిద్యావేత్తలు చెప్పిన కీలకమైన విషయం ఇది.. అయితే దీన్ని ఇంతేనా అని అనకుండా విశ్వాసం ఉంచి ఆచరిస్తే అనతికాలంలో దీని ఫలితం లభిస్తుంది.

అందరికీ తెలిసిన నిత్యపారాయణ స్ర్తోత్రం శ్రీ లలితాసహస్రనామం. ఇది అమ్మవారి వైభవం వివరించిన నామాలు. అంతేకాదు విశ్వ రహస్యాలు, శ్రీవిద్యా విశేషాలు సహితం దీనిలో ఉన్నాయి. అయితే ఈ స్ర్తోత్రాన్ని చెప్పిన వాగ్దేవతలను పూజిస్తే చాలు.. మీ పిల్లలకు విద్య తప్పకుండా వస్తుంది. ఆయా రంగాల్లో వారు విశేషంగా రాణిస్తారు.

make your kids do pooja to these gods for their success in education

అమ్మవారి నుంచి అవతరించిన వాగ్దేవతలు అమ్మ వైభవాన్ని కీర్తిస్తారు. వారు ఎనిమిది మంది. వీరు వాక్కుకు అధిష్టాన దేవతలు. శబ్దబ్రహ్మకు సగుణ రూపాలు. వారు.. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. వీరి నామాలను నిత్యం ఉదయం, సాయంత్రం స్నానానంతరం జపిస్తే తప్పక విశేష ఫలితం వస్తుంది. పూర్తి విశ్వాసంతో ఒక మంచిరోజున మీ పిల్లలకు వీటిని ఉపదేశించండి. వీలైతే మీ ఇంట్లో ఒక పేపర్‌పై మంచిగా రాసి అందరికీ కన్పించేటట్లు అతికించండి. నిత్యం ఈ దేవతలను స్మరిస్తే మంచి విద్యావంతులు అవుతారు.

Admin

Recent Posts