ఆధ్యాత్మికం

ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా ఒక్క‌సారి ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే.. అన్నీ పోతాయి..!

లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత ఒక మంచి జీవిత భాగస్వామిని చూసుకుని పెళ్లి చేసుకుని తర్వాత పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇది చెప్పడం చాలా సులభమే కానీ అందరికీ ఇది సాధ్యం కాదు. పెళ్లి అవ్వకపోవడం లేదంటే సంతానం కలగకపోవడం ఇటువంటి బాధల తో ఇబ్బంది పడుతూ ఉంటారు అలానే కొంతమంది శని దోషం తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.

ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే జీవితం లో ఒక్క సారి ఈ ఆలయానికి వెళ్తే సరిపోతుంది అత్యంత శక్తివంతమైన ఆలయం ఇది. ఈ ఆలయానికి వెళితే అనుకున్న కోరికలు తీరిపోతాయి పెళ్లి అవుతుంది సంతానం కలుగుతుంది. అదే మోపిదేవి ఆలయం. అత్యంత శక్తివంతమైనది ఈ మోపిదేవి ఆలయం కి దూర దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తారు.

mopidevi subramanyeshwara swamy temple visit once

ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామిని కొలుస్తారు. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ ఆలయానికి వచ్చి పరిష్కరించుకోవచ్చు. ఏమైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. సంతానం లేని వాళ్ళు ఒక్క రాత్రి ఇక్కడ నిద్ర చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి శివలింగ ఆకారం లో ఉంటారు విజయవాడ నుండి రెండు గంటల ప్రయాణం చేస్తే చాలు. ఈ ఆలయం వస్తుంది. మీ కోరికలు నెరవేరాలన్నా శని దోషం పెళ్లి సంతానం ఇటువంటివి ఏమైనా జరగాలంటే ఖచ్చితంగా ఈ ఆలయానికి వెళ్ళండి. మీ యొక్క సమస్య ని పరిష్కరించుకోండి.

Admin

Recent Posts