ఆధ్యాత్మికం

దోశను, చాక్లెట్లను, నూడుల్స్ ను ప్రసాదంగా అందించే దేవాలయాలు మన దేశంలో ఉన్నాయని మీకు తెలుసా?

దేవుడ్ని దర్శించుకొని మన కోరికలు, సమస్యలు, సాధకబాధలు తీర్చమని కోరుకుంటాం. దైవదర్శనం తర్వాత భక్తులకు ప్రసాదంగా చాలావరకు దేవాలయాలలో కొబ్బరి, చక్కర స్పటికం, శనగగుగ్గిళ్ళు, మిఠాయి వంటి తియ్యటి పదార్థాలను ప్రసాదంగా పెడతారు. అయితే కొన్ని ఆలయాలలో మాత్రం వీటికి విభిన్నంగా ప్రసాదాలను భక్తులకు అందిస్తున్నారు. ఆయా దేవాలయాలలో ఇచ్చే ప్రసాదాలను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అలగర్ కోవిల్ దేవాలయం.. తమిళనాడులోని అలగర్ కోవిల్ దేవాలయంలో మహావిష్ణువుని పూజిస్తారు. దైవదర్శనం అనంతరం భక్తులకు ప్రసాదంగా దోశలను వడ్డిస్తారు.

కర్ణిమాత దేవాలయం.. రాజస్థాన్ లోని కర్ణిమాత ఆలయంలో ఎలుకలు ఎప్పుడు సంచరిస్తూ ఉంటాయట. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలుకలతో ఉన్న ప్రసాదాన్ని ఇస్తారు. కమఖాయ టెంపుల్.. 18 శక్తిపీఠాలలో గౌహతిలోని కమఖాయ దేవాలయం ఒకటి. ఇక్కడి భక్తులకు ప్రసాదంగా అమ్మవారి తడి గుడ్డను అందిస్తారు. త్రిశూర్ మహదేవ ఆలయం.. కేరళలో గల త్రిశూర్ మహదేవ ఆలయం గోడలపై మహాభారతంలోని అక్షరాలు రాయబడి ఉంటాయి. ఇక్కడ ప్రసాదంగా హిందూ మతానికి, ఆ ఆలయానికి సంబంధించిన సీడీ డీవీడీలు, పుస్తకాలను ఇస్తారు.

these temples are giving different types of foods as prasadams

బాలసుబ్రమణ్య టెంపుల్.. కేరళలో ఉన్నటువంటి సుబ్రమణ్య దేవాలయంలో దేవుడ్ని చాక్లెట్లతో పూజిస్తారు. పూజ తర్వాత చాక్లెట్లను ప్రసాదంగా అందిస్తారు. చైనీస్ కాళి ఆలయం.. కలకత్తాలో ఉన్న చైనీస్ కాళి ఆలయాన్ని చైనీస్ నిర్మించారు. ఈ ఆలయంలో అమ్మవారి పూజా అనంతరం నూడుల్స్, ఫ్రైడ్ రైస్, ఇతర చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ ను ప్రసాదంగా పెడతారు. కాలభైరవ ఆలయం.. మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి భైరవ ఆలయంలో ఒక్క భైరవుడికి మాత్రమే మద్యంతో పూజలు చేస్తారు. ఇక్కడ భక్తులకు మద్యాన్ని ప్రసాదంగా అందిస్తారు.

Admin

Recent Posts