ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తలంటు స్నానం చేస్తే.. దరిద్ర దేవత దరిదాపున కూడా ఉండదట..!!

నిజంగా మనం స్నానం చేయడంలో కూడా రకరకాలు ఉంటాయి. ఈ నియమ నిబంధనలు పూర్వకాలం నుంచే వస్తున్నాయి. చాలామంది ప్రతిరోజు తలంటు స్నానం చేయరు. దానికంటూ కొన్ని ప్రత్యేకమైన రోజులను కేటాయించుకుంటా రు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తలంటు స్నానం చేయాలంటే ఈ రెండు రోజులే మంచిదని వారు అంటున్నారు.. మరి ఆ సమయంలో స్నానం చేస్తే ఏమవుతుంది? ఇలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

అసలు తల స్నానమైన తలంటు స్నానమైన సూర్యోదయానికి ముందే చేస్తే మంచిదని చెబుతారు.పొద్దెక్కిన తర్వాత లేదంటే తిన్న తర్వాత స్నానం చేస్తే ఫలితాలు ఉండవని, అనారోగ్యం కలగజేస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా తలస్నానమైన తలంటు స్నానమైన ప్రతిరోజు కాకుండా ఈ ప్రత్యేకమైన రోజుల్లో చేస్తే ఫలితాలు ఉంటాయని పండితులంటున్నారు..

what are the best days to do head bath

ముఖ్యంగా మగవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయొచ్చు కానీ ఆడవాళ్లు ప్రతిరోజు చేయకూడదు. ఆడవారు వారానికి రెండు సార్లు తలంటు స్నానం చేస్తే బాగుంటుందట. ముఖ్యంగా బుధ, శనివారాల్లో తలంటు స్నానం చేస్తే సత్ఫలితాలు ఉంటాయని పండితులు అంటున్నారు. ఒకవేళ మిగతా రోజుల్లో చేస్తే ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని, దరిద్ర దేవత మీ వెంటే ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.

Admin

Recent Posts