ఆధ్యాత్మికం

హుండీలో జారిపడిన భక్తుడి ఫోన్‌ దేవుడికే చెందుతుందా, తిరిగి తీసుకోలేరా?

ఆల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు స‌హ‌జంగానే భ‌క్తులు హుండీల్లో అనేక కానుక‌లు వేస్తుంటారు. ఈ కానుక‌లు ఎక్కువ‌గా డ‌బ్బు, న‌గ‌లు రూపంలో ఉంటాయి. కొంద‌రు ఆల‌యాల‌కు భూముల‌ను, వ‌స్తువుల‌ను దానం ఇస్తుంటారు. కొంద‌రు ఆల‌యానికి ఉండే గోశాల‌కు కావ‌ల్సిన సామ‌గ్రిని లేదా ఆవుల‌ను అందిస్తారు. అయితే ఆల‌య హుండీ విష‌యానికి వ‌స్తే అందులో నాణేలు, నోట్ల‌ను వేస్తారు. బంగారు న‌గ‌ల‌ను కూడా వేస్తుంటారు. కానీ అందులో ఒక వేళ ఫోన్ జారి ప‌డితేనో. ఆల‌య హుండీలో ఫోన్ జారి ప‌డితే ఎలా..? అప్పుడు ఆ ఫోన్ ఎవ‌రికి చెందుతుంది, భ‌క్తుడు మ‌ళ్లీ ఆ ఫోన్‌ను వెన‌క్కి ఎలా తీసుకోవాలి.. వంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆల‌య హుండీలో భ‌క్తులు పొర‌పాటున ఫోన్ వేసినా లేక జారిప‌డినా దాన్ని మ‌ళ్లీ వెన‌క్కి తీసుకోవ‌చ్చు. ఇందుకు గాను ఆల‌య అధికారుల‌ను సంప్ర‌దించాలి. హుండీని ఎప్పుడంటే అప్పుడు లెక్కించ‌రు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ఆ ఫోన్‌ను బ‌య‌ట‌కు తీస్తారు. అప్పుడు ఆ ఫోన్ మీదే అని రుజువు చేసుకోవాలి. దీంతో ఆ ఫోన్‌ను మీకు వెన‌క్కి ఇస్తారు.

what if your phone slips into temple hundi

అయితే ఒక‌వేళ మీరు కావాల‌నే ఫోన్‌ను హుండీలో వేస్తే అది దేవుడికి చెందుతుంది. దాన్ని వెన‌క్కి తీసుకోలేరు. హుండీలో ఏం వేసినా కూడా దైవానికి చెందుతుంది క‌నుక మీరు పూర్తి స్పృహ‌తోనే ఫోన్‌ను అందులో వేస్తే దాన్ని దైవానికి చెందిన‌దిగా భావించాలి. అలాంటి ఫోన్‌ను మ‌ళ్లీ వెన‌క్కి తీసుకోరాదు.

Admin

Recent Posts