ఆధ్యాత్మికం

హనుమంతుని శరీరమంతా సింధూరం ఎందుకు ఉంటుందో తెలుసా ..?

ప్ర‌తి ఏడాది రెండు సార్లు హ‌నుమాన్ జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హిస్తార‌న్న విష‌యం తెలిసిందే. సీతారామ దాసునిగా రామ భక్తునిగా విజయప్రదాతగా రక్షకునిగా పిలవబడే ఆంజనేయుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. అంజనా దేవి కేసరిల పుత్రుడైన హనుమంతుడిని హనుమాన్, మారుతి, భజరంగబలి, వాయు పుత్రుడు వంటి అనేక పేర్లతో పిలుస్తారు. వాయుదేవుని హౌరాస పుత్రుడైన హనుమ మహాబలుడు. అర్జునునికి ప్రియ సఖుడు.. అమిత పరాక్రముడు. లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని హరించిన వాడు. ఔషధీసమేతంగా సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. హనుమంతుని నామాలు ప్రయాణం చేసేటప్పుడు నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృత్యుభయం అస్సలు ఉండదు.

వారికి సర్వత్ర శుభం కలుగుతుంది. ధైర్య సాహసాలకు హనుమాన్ ప్రతిరూపం. ఆకాశమార్గాన ప్రయాణించి సముద్రం దాటి లంకలోకి ప్రవేశించి సీతమ్మ జాడ కనిపెట్టిన దీరుడు. సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకొచ్చిన వీర హనుమాన్ శక్తి యుక్తులను కీర్తించడం ఎవరి తరం కాదు. ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. మరికొన్ని ప్రాంతాలలో వైశాఖ దశమినాడు జరుపుతారు. ఇక కేరళ రాష్ట్రంలో మాత్రం మార్గశిర మాసంలో హనుమాన్ జయంతి నిర్వహిస్తారు. ఇంతటి ఘనుడైన హనుమాన్ శ్రీరాముని సేవకే పరిమితమయ్యారు.

why lord hanuman has sindhur all over his body

తన మనసులో శ్రీరామున్ని దాచుకున్నారు. తన తల్లి కంటే ఎక్కువగా రామున్ని ఆరాధించాడు. అయితే ఒక రోజు సీతమ్మ నుదుటన సింధూరం పెట్టుకుంటుంది. మీరు ఆ సింధూరం ఎందుకు పెట్టుకున్నారు తల్లి అని అడిగితే శ్రీరాముడు దీర్ఘాయుష్కుడుగా ఉండాలని పెట్టుకున్నాను అని చిరునవ్వుతో సమాధానం ఇస్తుంది సీతమ్మ. దీంతో హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన శరీరం అంతా సింధూరం పూసుకొని శ్రీరాముని పై తన భక్తిని నిరూపించుకుంటాడు. అందుక‌నే హ‌నుమాన్‌కు సింధూరం అంటే అంత ఇష్టం ఏర్ప‌డింది.

Admin

Recent Posts