ఆధ్యాత్మికం

మంగ‌ళ‌వారం అంటే ఆంజ‌నేయ స్వామికి ఎందుకు అంత ఇష్టం..?

మంగళవారం మంగళకరం.. ఈరోజు హనుమంతుడికి పూజ చేస్తుంటారు. మంగళవారం వీరాంజనేయుడికి పూజ చేస్తే చాలా మంచి జరుగుతుందని అంటారు. దీనికి గల కారణం ఏంటని తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. అయితే ఇది రామాయణంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా చెప్పబడిందట.

ఓ మంగళవారం రోజున సీతమ్మ తల్లి తన పాపిటన సింధూరం ధరించిందట.. అది చూసిన హనుమంతుడు కారణం అడుగుతాడట. పాపిటన సింధూరం ధరిస్తే రాముడు ఆయుష్షు పెరుగుతుందని చెబుతుందట. అక్కడనుండి వెళ్లిన హనుమంతుడు ఒళ్లంతా సింధూరమై దర్శనమిచ్చాడట.

why lord hanuman likes tuesday very much

రాముడి మీద హనుమంతుడి ప్రేమ మెచ్చి మంగళవారం నాడు ఎవరైతే హనుమంతుడికి సింధూరంతో అభిషేకం చేస్తారో వారి కోరికలు నెరవేరుతాయని చెప్పాడట. అలా రాముడు వాక్కుతో ప్రతి మంగళవారం హనుమంతుడికి ప్రత్యేక పూజలు అందుతున్నాయి.

Admin

Recent Posts