ఆధ్యాత్మికం

శుభకార్యాల్లో డబ్బు కట్నంగా వేసేటప్పుడు 1రూ. కలిపి ఇస్తారు ఎందుకు..?

సాధారణంగా భారతదేశంలో ఏ వర్గానికి చెందిన వారైనా శుభకార్యాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక బహుమతిని అందిస్తూ ఉంటారు. ప్రధానంగా హిందువుల పెళ్లిళ్లు లేదంటే పుట్టినరోజు ఇతర ఏ శుభకార్యాలైన పలు రకాల బహుమతులను అందజేస్తూ ఉంటారు. లేదంటే మనీ కవర్లో పెట్టి కొంత మొత్తాన్ని అందిస్తారు. మరి ఆ విధంగా మనీ అందించేటప్పుడు తప్పనిసరిగా వారు ఇచ్చే అమౌంట్ కి ఒక రూపాయి కలుపుతారు.

ఉదాహరణకి 51 రూపాయి, 101 రూపాయి, 201రూపాయి, ఇలా ఎంత అమౌంట్ ఇచ్చిన కానీ రూపాయి కలపడం అనేది చూస్తూ ఉంటాం. మరి అలా రూపాయి ఎందుకు కలుపుతారో ఇప్పుడు తెలుసుకుందాం..అయితే 50,100, 500 ఇలా అంకెల చివరిలో సున్నాలు ఉన్నాయి కదా. ఇలా సున్నా వచ్చేలా డబ్బు రౌండ్ ఫిగర్ తో ఇస్తే అది తీసుకున్న వారికి సమస్యలు వస్తాయట.

why money will not be given in round figures in good deeds

అంతే కాదు నూతన వధూవరులకు రౌండ్ ఫిగర్ తో డబ్బులు చదివిస్తే దాంతో వారి వివాహ జీవితంలో సమస్యలు ఎదురవుతాయని అంటారు పెద్దలు. కాబట్టి డబ్బు చదివింపులు చేసినప్పుడు 51, 101 ఇస్తే దాన్ని విభజించడానికి వీలు ఉండదు. ఈ డబ్బు తీసుకున్న వారు కూడా ఆనందంగా ఉంటారట. రౌండ్ ఫిగర్ కు ఒక రూపాయి కలపడం వల్ల అది ఇచ్చే వారికి మరియు తీసుకునే వారికి శుభం కలుగుతుందని అంటుంటారు పెద్దలు. దీనివల్ల విద్యతో పాటు ఆరోగ్యం ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు.

Admin

Recent Posts