ఆధ్యాత్మికం

మ‌ర‌ణించిన త‌రువాత దెయ్యాలుగా మార‌డానికి ఉన్న కార‌ణాలు ఇవే..!

మ‌ర‌ణించిన త‌రువాత దెయ్యాలుగా మారేందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయ‌ని పండితులు చెబుతున్నారు. ఈ కార‌ణాలు అనేవి దాదాపుగా అన్ని మ‌తాల్లోనూ ఒకే ర‌కంగా ఉంటాయి. ప్రజలకు నెరవేరని కోరికలు ఉంటే వారు మరణం తర్వాత దయ్యాలుగా మారతారని నమ్మకం అనేది మొదటి కారణం. ప్రపంచంలో దాదాపు అన్ని సంస్కృతుల వారికీ ఈ నమ్మకం ఉంది.

ఆధ్యాత్మిక భావాలు లేని వారు లేదా నాస్తికులు కూడా మ‌ర‌ణించిన త‌రువాత దెయ్యాలుగా మారుతార‌ని చెబుతారు. భూమి మీద జీవించి ఉన్న‌ప్పుడు తీవ్ర‌మైన అత్యాశ క‌లిగిన వారు, ధ‌నం అంటే అమిత‌మైన ప్రేమ ఉన్న‌వారు కూడా దెయ్యాలుగా మారుతార‌ని అంటారు. ఎల్ల‌ప్పుడూ ప్ర‌తి కూల ఆలోచ‌న‌లు ఉన్న‌వారు, నెగెటివ్ ఆలోచ‌న‌లు మాత్ర‌మే చేసేవారు కూడా మ‌ర‌ణించిన త‌రువాత దెయ్యాలుగా మారుతార‌ట‌. తీవ్ర‌మైన కోపం, అహం, ఈర్ష్య‌, అసూయ‌, ద్వేషం వంటివి ఉన్నా కూడా అలాంటి వారు చ‌నిపోయాక దెయ్యాలుగా మారుతార‌ట‌.

why people become ghosts

దెయ్యాలు అంటే చాలా మందికి న‌మ్మ‌కం ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ దేవుడు ఉన్నాడ‌ని న‌మ్మితే దెయ్యం ఉంద‌ని కూడా న‌మ్మాల్సి వ‌స్తుంద‌ని కొంద‌రు అంటారు. అస‌లు దెయ్యాలే లేవ‌ని, అవి ఉంటే మ‌నుషులు అస‌లు ఈ భూమిపై ఉండ‌ర‌ని కొంద‌రు కొట్టి పారేస్తారు. ఇక నెగెటివ్ ఎన‌ర్జీనే దెయ్యం అని కొంద‌రు అంటారు. ఏది ఏమైనా దెయ్యాల‌పై డిబేట్ మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి అలా కొన‌సాగుతూ వ‌స్తూనే ఉంది.

Admin

Recent Posts