ఆధ్యాత్మికం

గ‌డ‌ప‌కు ప‌సుపు రాసి కుంకుమ బొట్ల‌ను ఎందుకు పెట్టాలి..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

ఏ గృహానికైనా గడపలు తప్పనిసరిగా ఉండాల్సిందే. పల్లెటూల్లలోనే కాదు పట్టణాల్లో కూడా నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గమనించినట్లైతే ఇంటి సింహద్వారానికి గడపలే కాకుండా ఆ ఇంటిలో ఏ గదికైనా గడపలు లేకుండా ద్వారాలుండవు. గడపలేని గృహం కడుపులేని దేహం లాంటిది అని అంటుంటారు. గడపకు పసుపు.. గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇళ్లు కళకళలాడుతుంది. ఆయురా‌రోగ్యం అందించే గడప పండుగ రోజులు, ఇతర విశేష దినాల్లో గడపకు పసుపు రాయడం మన సంప్రదాయం. ఈ ఆచారాన్ని మొక్కుబడి వ్యవహారంగా అందరూ పాటిస్తుంటారు. కానీ, ఇలా ఎందుకు పసుపు రాస్తారో, దీని వెనుక ఉన్న ప్రయోజనాలు ఏమిటో చాలా మందికి తెలీదు. పురాణ గ్రంధాల్లో ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. గడపకు పసుపు రాస్తే సూక్ష్మ క్రిములు నశిస్తాయనే సంగతి అందరికీ తెలుసు. తెలీని విషయం ఏమిటంటే గడపకు పసుపు రాస్తే మంచి వరుడు వస్తాడని. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టినందువల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయని మన ధార్మిక గ్రంధాలు చాటుతున్నాయి.

గడపను గౌరీ దేవితోనూ ,మహాలక్ష్మీ తోనూ పోలుస్తాం మనం.అందుకే ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు ,క్రిములు ప్రవేశించకుండా గడపకు పసుపు రాసి బొట్టుపెట్టి క్రమం తప్పకుండా పూజ చేస్తాం. గడప చాలా ప్రాధాన్యత కలిగినది. ఇంట్లో ఆయా గదులకు గడపలు లేకున్నా సరేకానీ తప్పనిసరిగా గృహంలో సింహద్వారానికి గడప ఖచ్చితంగా ఉండాలి. గడపను పసుపు, కుంకుమలతో, బియ్యంపిండితో అలంకరించుకుంటేనే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పెద్దల నమ్మకం. పసుపులో యాంటీబయటిక్‌ గుణం ఉంది. మనం వీధులల్లో వెళ్తున్నపుడు ఎన్నో లక్షల బ్యాక్టీరియాలను మన చెప్పులకు, మన కాళ్లకు అంటించుకుని ఇంట్లోకి వస్తుంటాము. ఉదయాన్నే పసుపు నీళ్లతో శుద్ధిచేసినటువంటి గడపలోకి అడుగుపెట్టినప్పుడు పసుపులో ఉండే యాంటీ బయోటిక్ గుణం మనకు తెలియకుండానే మన కాళ్లను శుద్ధిచేస్తాయి. అనేక లక్షల సూక్ష్మజీవులను మన కాళ్లనుండి దూరం చేస్తాయి.

why we need to apply turmeric and kumkum to gadapa

గడపకు పసుపు రాసే సంప్రదాయం పాటించే ఆడపిల్లలకు ఆలస్యం కాకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి. సమయానికి పెళ్ళి జరగడమే గాక మంచి వరుడు వస్తాడు. మనసు అర్ధం చేసుకునేవాడూ, ఎన్నడూ విడిపోనివాడూ వస్తాడు. గడపకు పసుపు రాసే సంప్రదాయం ఉన్న ఇళ్ళలో పిల్లలు చెప్పిన మాట వింటారు. అభివృద్ధి పథంలో నడుస్తారు. అలాంటి ఇళ్ళు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటాయి. పిల్లలు మంచి ఆశయాలతో పెరిగి, కుటుంబానికి వన్నె తెస్తారు. గడపకు పసుపు రాసి, కుంకుమ దిద్దే తల్లులకు కూతురు లాంటి కోడళ్ళు, కొడుకుల్లాంటి అల్లుళ్ళు వస్తారు. జ్యోతిష్యశాస్త్రాన్ని అనుసరించి పసుపు గురు గ్రహాన్ని, అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని, సంపదలను సూచిస్తుంది. ఎరుపురంగు శుక్ర గ్రహాన్ని, సుఖాలను, సంపదలను సూచిస్తుంది. గుమ్మానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టడం ద్వారా గురు, శుక్రులు మనకు అనుకూలంగా ఉంటారు. సంపదలు లభ్యమౌతాయి.

Admin

Recent Posts