ఆధ్యాత్మికం

ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా…?

గోరింటాకు ఇష్టపడని మహిళలు చాలా అరుదు. పండుగలైనా.. ఫంక్షలైనా ముందుగా ఆడవారు గోరింటాకుకే ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడంటే మార్కెట్లో పౌడర్లు.. కోన్స్ లాంటివి రెడీమేడ్ గా దొరుకుతున్నాయి కానీ.. ఇదివరకటి రోజుల్లో ప్రతి ఇంటి పెరట్లో గోరింటాకు చెట్టు తప్పనిసరిగా ఉండేది. ఆషాఢంలో గోరింటాకుకు చాలా ప్రత్యేకత ఉంది. ఆషాఢమాసం వచ్చేస్తోంది .. అనగానే ఆడవారి అరచేతులు గోరింటాకుతో అందంగా మెరిసిపోతుంటాయి.

ఈ మాసంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం మన సంస్కృతిలో ఉంది. అసలు దీని వెనుక ఉన్న మర్మమేంటో.. మీకు తెలుసా..? ఆషాఢమాసంతో గ్రీష్మరుతువు పూర్తిగా వెళ్లిపోయి.. వర్షరుతువు ప్రారంభమౌతుంది. గ్రీష్మంలో మన శరీరంలో బాగా వేడి పెరుగుతుంది. ఆషాఢంలో బయట వాతావరణం చల్లబడిపోతుంది.. మన శరీరంలో ఉన్న వేడి.. బయట చల్లబడిన వాతావరణం పరస్పర విరుద్ధం కాబట్టి అనారోగ్యాలు మొదలౌతాయి.

why women put gorintaku in ashadha masam

గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి ఉంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందువల్లే మన ప్రాచీనులు గోరింటాకును ఆషాఢమాసంలో తప్పకుండా పెట్టుకోవాలని చెబుతారు. మహిళలు.. ఈ ఆషాడంలో అందంతో పాటు.. ఆరోగ్యాన్నిచ్చే గోరింటను మీ అరచేతుల నిండా నింపుకోండి.

Admin

Recent Posts