ఆధ్యాత్మికం

రాత్రి పూట స్త్రీలు జుట్టును విర‌బోసుకుని ఉండ‌కూడ‌దు.. ఎందుకంటే..?

రాత్రి పూట‌ జుట్టు విప్పి తిరగకూడదు రాత్రిపూట తల దువ్వుకోకూడదు అని పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు అయితే అసలు రాత్రిళ్ళు ఎందుకు మనం తలని దువ్వుకోకూడదు, జడ విప్పకూడదు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. పండితులు ఎన్నో అమోఘమైన విషయాలని పంచుకున్నారు రాత్రిపూట ఇల్లు తుడవకూడదు. అలానే గోళ్ళని కూడా కత్తిరించుకోకూడదు రాత్రిపూట తల దువ్వుకోవడం కూడా తప్పు.

రాత్రి పూట అసలు తలని దువ్వుకోకూడదు అలానే జుట్టు కూడా విరబోసుకుని తిరగకూడదు సూర్యాస్తమయం అయిన తర్వాత అసలు తలని విప్పకూడదట. కురులని ముట్టుకోవడం కూడా మంచిది కాదు. చెడు శక్తులు బయట సంచరిస్తూ ఉంటాయి. సూర్యాస్తమయం అయ్యాక తల దువ్వుకోకూడదు. చెడు శక్తులు ఆవహిస్తాయి పొడవాటి కురులు కలిగిన మహిళల్ని చెడు శక్తులు పట్టుకుంటాయి దాంతో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాలి. జుట్టు విప్పుకుని మహిళలు ఉండడం చెడు శకునంగా భావిస్తారు కూడా.

women should not lose their hair at night know why

ఒక్కొక్కసారి జుట్టు రాలుతూ ఉంటుంది దానిని ఎక్కడపడితే అక్కడ పారేయడం కూడా తప్పు జుట్టు రాలిపోతూ ఉంటుంది. కాళ్ళల్లో అడ్డం పడుతూ ఉంటుంది తినే ఆహారంలో కూడా పడుతుంది అయితే జుట్టు ఎక్కడ పడితే అక్కడ ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. ఆడవాళ్లు నెలసరి సమయంలో కూడా తలస్నానం చేయకూడదు నెలసరి అయిన వెంటనే చాలామంది స్త్రీలు తలస్నానం చేస్తారు కానీ నీరసం వస్తుంది. అలానే అధిక రక్తాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ పొరపాట్ల‌లని అసలు చేయకండి ముఖ్యంగా రాత్రిపూట తల దువ్వుకోకూడదు. కారణం తెలిసింది కదా ఈసారి అసలు తప్పును చేయకండి అనవసరంగా చిక్కుల్లో పడతారు.

Admin

Recent Posts