వినోదం

చిరంజీవి సినిమాల్లోని ఏ సినిమాలో ఆయ‌న‌ నటించకుండా ఉండాల్సింది?

నా వరకైతే అల్లుడా మజాకా!! చిత్రంలో చిరంజీవి నటించడం నచ్చలేదు. నేను మెగాస్టార్ అభిమానైనా ఈ సినిమా నాకు అసలు నచ్చలేదు. ఈ చిత్రంలోని అత్త-అల్లుడు మద్య వచ్చే సన్నివేశాలు ఎబెట్టు అసహ్యంగా అనిపించాయి, ఇందులోని పాత్రలు ఇద్దరు హీరోయిన్లతో ప్రవర్తించిన విధంగానే హీరో ఆ పిల్లల తల్లి అయిన అత్తతో కూడా ప్రవర్తిస్తుంటాడు, అది నచ్చలేదు. హీరోయిన్ల ఇద్దరికి కూడా తనే మొగుడు అనే క్రమంలో వాళ్లతో చేసే వెకిలి హాస్యం చూస్తే చిరాకేస్తుంది, ఇక అత్త పాత్రతో అల్లుడు ప్రవర్తించే విధానం నాకు అస్సలు నచ్చలేదు. మన తెలుగు వాళ్ళం పిల్లనిచ్చిన అత్తగారిని తల్లిగా భావించాలనేది మన సాంప్రదాయం, అటువంటిది చిరంజీవి లాంటి గొప్ప స్టార్ ఇటువంటి కుసంస్కారమైన కథను ఎందుకు ఒప్పుకున్నారో తెలీదు.

ఇక ఇందులోని ముఖ్య పాత్ర అత్తపాత్ర ఆ పాత్రకు లక్ష్మీకంటే ముందు సీనియర్ హీరోయిన్ వాణిశ్రీ అడ్వాన్స్ తీసుకున్నారు, తరువాత ఈ సినిమాలోని అత్త అల్లుడు మధ్య వచ్చే సన్నివేశాలు అత్త పాత్ర గురించి తెలుసుకొని, ఈ పాత్ర నేను చేయను అంటూ కొంత షూటింగ్ చేసి కూడా అడ్వాన్సు తిరిగి ఇచ్చేసి, ఈ పాత్రను ఆ సినిమాని వదులుకున్నారు. ఇక చిరంజీవి,బ్రహ్మానందం,చలపతిరావు సీనియర్ నటి లక్ష్మీ కాంబినేషన్లో వచ్చే సీన్స్ అన్నీ వెకిలిగా మురికిగా ముతకగా ఉంటాయి. ఎంత ఎబ్బెట్టుగా అంటే ఇప్పటి పరిస్థితిలో ఈ సినిమా తీస్తే చిత్రం యూనిట్ ని జనం సోషల్ మీడియాలోట్రోల్ చేసి ఛీ.. కొడతారు. ఇందులో అత్త-అల్లుడు మధ్య వచ్చే సన్నివేశాల గురించి బోలెడు వ్రాయవచ్చు, కానీ నేను అంత లోతుకు పోదలుచుకోలేదు.

chiranjeevi should not have done alluda majaka movie

ఆ సన్నివేశాల గురించి ఇక్కడ నేను వ్రాయదలుచుకోలేదు,వ్రాయను. ఇక హీరో చిరంజీవి దర్శకుడు ఈ వివి సత్యనారాయణ, ఈ సినిమా గురించి వివరిస్తూ మాస్ జనానికి నేల టికెట్ వాళ్ళ వినోదం ఇవ్వడంకోసం కోసం ఈ సినిమా చేసాం అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఐనా జనం అప్పుడు ఇంత ముతక హాస్యాన్ని మురికి సన్నివేశాలను ఎందుకు ఎంజాయ్ చేశారో, నాకు ఇప్పటికీ అర్థం కాదు. దర్శకుడు ఈవివి,చిరంజీవి ఇరువురు ఈ సినిమాని సమర్థించుకున్నప్పటికీ కొన్ని వర్గాల ప్రేక్షకులు నొచ్చుకున్నారు, ఆలస్యంగా నైనా ఈ సినిమా విషయంలో జరగాల్సినంత గొడవ జరిగింది. ఆ మూమెంట్లో చిరంజీవి ఇరకాటంలో ఇబ్బందిలో పడ‌డం జరిగింది.

దీని గురించి మహిళా సంఘాల నుండి వచ్చిన విమర్శకులకు చిరంజీవి కొంతకాలం మొహం చాటేసారు. కానీ కొంతమంది వీరాభిమానులు ఈ సినిమా 100 రోజులు ఆడింది హిట్ అయింది కదా ఏంది ఈ గొడవ? అని అప్పుడు ఒక వాదన చేసి సమర్థించారు. సరే ఈ సినిమా 100 రోజులు ఆడివుండవచ్చు, కోట్ల రూపాయల కలెక్షన్ తెచ్చి ఉండవచ్చు కానీ చెడు చెడే వంద మందికి నచ్చిందని దొంగతనం దొరతనం కాదు. మంచితనము అంతకంటే కాదు. చిరు అభిమానైన నేను ఈ సినిమా విషయంలో చాలా బాధపడ్డాను. ఇప్పటికీ ఈ సినిమా వస్తుంటే అన్నయ్య ఈ సినిమా ఎందుకు చేశాడని బాధనిపిస్తుంది.

Admin

Recent Posts