వినోదం

ఉదయ్ కిరణ్ మరో అమ్మాయిని ప్రేమించాడని తెలిసి కూడా చిరు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారా?

<p style&equals;"text-align&colon; justify&semi;">2000 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో చిత్రం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఒకేసారి ఎంతో ఎత్తుకు ఎదిగారు&period; ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన చిత్రం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది&period; దీంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ ఉదయ్ కిరణ్ వైపు చూసింది&period; ఈ సినిమా తరువాత ఉదయ్ కిరణ్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని ఎంత త్వరగా ఫేమస్ అయ్యారో అంతే త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు&period; అయితే ఉదయ్ కిరణ్ ని తొక్కేసేందుకు కుట్రలు కూడా జరిగాయి అన్న ప్రచారం అప్పట్లో ఇండస్ట్రీలో వినిపించింది&period; ఉదయ్ కిరణ్ తనకు ఎంత స్టార్డం వచ్చినా ఎప్పుడు ఒదిగి ఉండేవాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయినా విధి ఆడిన వింత నాటకంలో ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు&period; అయితే ఉదయ్ కిరణ్ మన మధ్య లేకపోయినా ఆయనకు సంబంధించిన విషయాలు ఇప్పటికీ చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి&period; అయితే ఉదయ్ కిరణ్ కి మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే&period; అది పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేకప్ అయ్యింది&period; అందుకు గల కారణాలను అనేకం చెబుతుంటారు&period; అయితే ఉదయ్ కిరణ్ ఫస్ట్ లవ్ బ్రేకప్ సంగతి గురించి తెలిసినప్పటికీ చిరంజీవి తన కూతురిని ఉదయ్ కిరణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట&period; సుస్మిత తో ఎంగేజ్మెంట్ కి ముందు ఉదయ్ కిరణ్ ఓ మహిళా జర్నలిస్టుతో ప్రేమలో పడ్డారు&period; మనసంతా నువ్వే చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యాక తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఓ మహిళా జర్నలిస్టుతో ఉదయ్ కిరణ్ కి పరిచయం ఏర్పడింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82948 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;uday-kiran-2&period;jpg" alt&equals;"did chiranjeevi know about uday kiran love previously " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత వారిద్దరి మధ్య మాటలు కలవడంతో అది ప్రేమగా మారింది&period; అయితే చిన్న చిన్న మనస్పర్ధల నేపథ్యంలో ఆ మహిళ జర్నలిస్టు ఉదయ్ కిరణ్ కి బ్రేకప్ చెప్పేసింది&period; చివరికి ఆమెతోపాటు వాళ్ళ ఇంటికి వెళ్లి బ్రతిమాలడంతో పాటు వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేశారట&period; కానీ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఉదయ్ కిరణ్ తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు&period; ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవికి సైతం చెప్పి ఎంతో బాధపడేవారట&period; అప్పుడు చిరంజీవి ముందు కెరీర్ మీద దృష్టి పెట్టాలని సూచించారట&period; ఆ సమయంలో ఉదయ్ కిరణ్ పై చిరంజీవికి ఇంప్రెషన్ కలగడంతో తన కూతురితో పెళ్లి జరిపించాలని అనుకున్నారట&period; కానీ ఏవో తేడాలు రావడంతో పెళ్లి పీటల వరకు వచ్చి క్యాన్సల్ అయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts