వినోదం

అల్లు అరవింద్ రెండవ కొడుకు అలా చనిపోయాడా.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన అల్లు శిరీష్!

టాలీవుడ్ ఆగ్ర నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ కమర్షియల్ జీనియస్ గా అల్లు అరవింద్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన నిర్మించిన సినిమాలలో 80% పైగా సినిమాలు కమర్షియల్ సక్సెస్ అందుకున్నవే. హీరో స్టార్ డమ్, దర్శకుడి ప్రతిభ ఆధారంగా సినిమాపై ఖర్చు చేస్తూ ఉంటారు అల్లు అరవింద్. అల్లు రామలింగయ్య తనయుడిగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు అరవింద్. అయితే అల్లు అరవింద్ సినీ కెరియర్ గురించి మనందరికీ తెలిసిందే.

అలాగే ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా మనందరికీ తెలుసు. అల్లు అరవింద్ కి ముగ్గురు కుమారులు. ఒకరు అల్లు అర్జున్, మరొకరు అల్లు శిరీష్, మరొకరు అల్లు వెంకటేష్ ( బాబి ) అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే..

do you know allu aravind has a son and he is died

అల్లు అరవింద్ కి మరొక కుమారుడు కూడా ఉన్నారట. అంటే అరవింద్ కి నలుగురు కుమారులు అన్నట్లు. ఈ విషయాన్ని తాజాగా అల్లు శిరీష్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ.. మా నాన్నకి మేము నలుగురం. పెద్దన్నయ్య అల్లు వెంకటేష్ తర్వాత రాజేష్ జన్మించాడు. వీరిద్దరి తర్వాత అల్లు అర్జున్ జన్మించాడు.

అయితే ఏడేళ్ల వయసులో రాజేష్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. నేను పుట్టడానికంటే ముందు ఈ సంఘటన జరిగింది అని చెప్పుకొచ్చారు అల్లు శిరీష్. ఈ సంఘటన అరవింద్ దంపతులకు కడుపుకోతను మిగిల్చింది. అల్లు రాజేష్ మరణించే సమయానికి అరవింద్ కు అల్లు అర్జున్ కూడా పుట్టారు. అయితే రాజేష్ మరణించిన విషయం అల్లు అభిమానులకు చాలామందికి కూడా తెలియకపోవచ్చు. ఈ వార్త వైరల్ కావడంతో పలువురు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Admin

Recent Posts