వినోదం

ఆచార్య ఒరిజినల్ స్టోరీ ఇదే.. ఇలా తీసి ఉంటే హిట్టేనట ?

<p style&equals;"text-align&colon; justify&semi;">మల్టీ స్టార్ అంటేనే ప్రేక్షకుడు ఎన్నో అంచనాలతో థియేటర్ కు వెళ్తాడు&period; అలాంటిది మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ ఒకే సినిమాలో ఉన్నారంటే హైపు ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు&period; చిరు&comma; చరణ్ నటించిన చిత్రం ఆచార్య&period; అయితే&comma; మెగాస్టార్ చిరంజీవి&comma; రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొత్తం రూ&period; 130 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ జరగగా చిత్రం విడుదలయ్యాక వచ్చిన షేర్ కేవలం రూ&period; 45 కోట్లు మాత్రమే&period; దీనితో డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోయామని లబోదిబోమన్నారు&period; అయితే వాస్తవానికి ఆశ్చర్య ఒరిజినల్ స్టోరీ వేరే ఉందని సమాచారం&period; ఇందులో చిరంజీవి నక్సలైట్ గా కాకుండా ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించాల్సి ఉందట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70304 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;acharya-2&period;jpg" alt&equals;"do you know that this is acharya original story " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్రమంలోనే ప్రభుత్వ అధికారిగా ఆయన ధర్మస్థలిని ఎలా కాపాడుతారు&period; అని కొరటాల లైన్ రాసుకున్నారట&period; ఇక చరణ్ ను కూడా ఇందులో చూపించాలని అనుకున్నారట&period; కానీ అసలు ఏం జరిగిందో తెలియదు&period; కథను పూర్తిగా మార్చేశారు&period; చరణ్ పాత్రను బలవంతంగా జోడించినట్లు చేశారు&period; అలాగే చిరంజీవి పాత్రను నక్సలైట్ బ్యాక్ డ్రాప్ తో మార్చేశారు&period; ఇక కాజల్ అగర్వాల్ పాత్రను తీసేశారు&period; కథలో చివరి నిమిషం వరకు ఇలా అనేక మార్పులు చేయడం వల్లే ఆచార్య ఫ్లాప్ అయిందని అన్నారు&period; ముందుగా అనుకున్న స్టోరీ తోనే మూవీ ని తీసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అన్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts