వినోదం

చిరంజీవి ఫేవరెట్ ఆహారం ఏంటో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఛాన్సులు రాక ఆపసోపాలు పడ్డారు. కానీ ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా తాను ఎంచుకున్న దారిని వదలకుండా ముందుకు సాగారు.

సాధారణ హీరో నుంచి ఇండస్ట్రీ ని ఏలే స్థాయికి చేరుకున్నారని చెప్పవచ్చు.. అలా మెగాస్టార్ చిరంజీవి స్వశక్తితో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలామంది హీరోలు ముందుకు వచ్చారు. చిరంజీవి తన నటన డాన్స్ల తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు వచ్చారు.. ఇలాంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ఎలాంటి వార్త వచ్చినా అభిమానులు ఎంతో ఆనందపడతారు.

do you know which food chiranjeevi likes most

ప్రస్తుతం ఆయన గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.. చిరంజీవి తినే ఫుడ్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవికి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టమట. ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్లినప్పుడు ఎక్కువగా సీ ఫుడ్ తినడానికే ఇష్టపడతారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియా వైరల్ గా మారింది.

Admin

Recent Posts