వినోదం

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే !

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే.. కొన్ని సినిమాల్లో నటించిన నటీనటులు హీరో హీరోల కంటే ఎక్కువగా గుర్తింపు సాధిస్తూ ఉంటారు. వారు చేసేది చిన్న పాత్రే అయినా జనాలకు చాలా కనెక్ట్ అవుతూ ఉంటారు. అలాంటివారు భవిష్యత్తులో మంచి పొజిషన్ కు వెళుతూ ఉంటారు. అలాంటి ఓ అమ్మాయి మహేష్ బాబుతో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో నటించింది. ఆమె చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ అందరికీ గుర్తుండిపోయే రేంజ్ కి వెళ్ళింది.

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సుప్రియ. ఈమె ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు ముఖ్యమైన పాత్రల్లో పోషించింది. ముఖ్యంగా బాబు బాగా బిజీ అనే చిత్రంలో న‌టించి సంచలనం క్రియేట్ చేసింది. ఇందులో ప్రముఖ నటుడు రచయిత అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించాడు. ఈ పాత్ర తర్వాత తెలుగులో ఆమెకు అలాంటి పాత్రలు ఎక్కువగా వచ్చాయట. కానీ అలాంటి వాటిలో నటించడం ఇష్టం లేక తెలుగు ఇండస్ట్రీని వదిలి బాలీవుడ్ లోకి వెళ్లింది.

have you identified this actress and who she is

అక్కడ ఈమెకు అదృష్టం కలిసి వచ్చి పవర్ఫుల్ పాత్రలు వచ్చాయి. తెలుగు అమ్మాయి అయ్యుండి ఇక్కడ అవకాశాలు రాక అక్కడికి వెళ్లడం దురదృష్టకరమే. కానీ సక్సెస్ అయిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈమె విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో వచ్చిన రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో కీలకపాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ప్రస్తుతం ఆమె లేటెస్ట్ లుక్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన అమ్మాయి ఈ అమ్మాయేనా అంటూ షాక్ కు గురవుతున్నారు. ప్రస్తుతం సుప్రియ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు కూడా చేసింది.

Admin

Recent Posts