వినోదం

RRR ఇంటర్వెల్ లోని ఈ సీన్ లో ఇంత అర్థం ఉందా ? రాజమౌళి నిజంగా గ్రేట్

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుపులల చాటిన దర్శకుడు రాజమౌళి.. ఇప్పటికీ ఆయన బాహుబలి సినిమాతో అనేక రికార్డులు కొల్లగొట్టారు. మళ్లీ ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరును దేశం నలుమూలలా చాటారు. అలాంటి దర్శక ధీరుడు జక్కన్న దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్,ఎన్టీఆర్ హీరోలుగా నటించిన మూవీ ఆర్ఆర్ఆర్..ఇది థియేటర్ లోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇందులో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. ఇందులో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ నటించి మెప్పించారు. అయితే.. ఈ సినిమాలో చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ ఇద్దరూ కలిసినప్పుడు.. వారి ఇద్దరి చేతులను సమానంగా..షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినట్లు చూపిస్తారు రాజమౌళి.

have you observed this coincidence in rrr movie

అలాగే.. ఇంటర్‌ వెల్‌ సీన్‌ అంటే.. ఆంగ్లేయుల కోటను ఎన్టీఆర్‌ బద్దలు కొట్టిన సమయంలో.. చరణ్‌ కు దొరికిపోతాడు ఎన్టీఆర్‌. ఆ సమయంలో.. కింద పడుతున్న ఎన్టీఆర్‌ ను చరణ్‌ కాపాడుతాడు. ఆ సమయంలో.. చరణ్‌ చేయి.. పైకి ఉంటుంది.. ఎన్టీఆర్‌ చేయి కిందకు ఉంటుంది. ఇక క్లైమాక్స్‌ లో చరణ్‌ ను కాపాడేందుకు వెళ్లినప్పుడు.. ఎన్టీఆర్‌ చేయ్‌ పైన ఉంటుంది. ఎన్టీఆర్‌ చేయ్‌ పట్టుకుని.. చరణ్‌ ఓ హోల్‌ నుంచి పైకి లేస్తాడు. ఇలా.. ఏ హీరో తక్కువ కాకుండా… రాజమౌళి సీన్లను రూపొందించారు.

Admin

Recent Posts