వినోదం

అన్ని సినిమాలు, ఒకటే పాత్ర! ఈ వ్యక్తిని గుర్తుపట్టారా? అతను ఎవరంటే?

మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న పాపులారిటీ అంతా కాదు. ఈ చిత్ర పరిశ్రమలో వారసత్వంగా హీరోలు కాగా మరి కొంతమంది కష్టపడి పైకి వచ్చారు. ఇక మరికొందరు తమ కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో ఉండటం కారణంగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు. కొంత మంది ఎదిగితే, కొంత మంది రాణించలేకపోతున్నారు. అయితే, తెలుగు సినిమాల్లో ఎప్పటికీ ఫేడ్అవుట్ అవ్వని ఫార్ములా ఏదైనా ఉంది అంటే అది హీరోయిజంని, హీరోని ఎలివేట్ చేసే సీన్స్. అయితే ఈ సీన్స్ లో కొన్నిసార్లు యాక్షన్స్, మ్యూజిక్ కీరోల్ పోషిస్తాయి.

కానీ కొన్నిసార్లు హీరోని ఎలివేట్ చేసే పాత్రలు ఉంటాయి. అలా తెలుగులో కొన్ని సూపర్ హిట్ ఎలివేషన్స్ సీన్స్ వెనుక ఒకే వ్యక్తి ఉన్నారు. ఆయనే రాయల హరిశ్చంద్ర. చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. మహేష్ బాబు కెరీర్ లోనే సూపర్ హిట్ అయిన ఒక్కడు చిత్రంలో, మహేష్ కొండారెడ్డి బురుజు వద్ద ప్రకాష్ రాజు నీ కొట్టిన సీన్ లో ఒక వ్యక్తి, పట్ట పగలు నడిరోడ్డు పైన, కొండారెడ్డి బురుజు దగ్గర ఓబుల్ రెడ్డి మీద చేయి చేసుకున్నాడు, ఎవడ్రా అతను అని నటుడు హర్షంగా ఇచ్చిన ఎలివేషన్ హైలైట్ అసలు. అలాగే ఆ తర్వాత బాహుబలి చిత్రంలో అమరేంద్ర బాహుబలి రాజా ఆజ్ఞను ధిక్కరించి అనుష్కతో కలిసి కోటను వీడి బయటకు వచ్చే సన్నివేశంలో కూడా, అరే ఏడుస్తారు ఏంట్రా, దేవుడు గుడి వదిలి, మనతో ఉండేందుకు వస్తున్నాడు రా, పండగ చేసుకోవాలి రా, అంటూ ఆయన చెప్పే సీన్ కూడా చిత్రంలో హై లైట్ గా నిలిచింది.

have you observed this man rayala in movies

అలాగే మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఖలేజా చిత్రంలో కూడా ఒక సీనులో ఆయన కనిపిస్తారు. విలన్స్ లో ఒకరిని మహేష్ కొట్టి తీసుకువెళ్తుంటే, ఏంటండీ ఈ దారుణం పట్టపగలే కిడ్నాప్ ఆహ్, ముందు పోలీసులకి ఫోన్ చేయండి, అనే డైలాగ్ ఆయన చెప్తారు. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ మూవీలో కూడా క్లైమాక్స్ లో ఆయన తన నటనతో మెప్పించారు. ప్రస్తుతం ఆయన చేసే ఎలివేషన్స్ కి సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Admin

Recent Posts