వినోదం

రామ్ చరణ్ కోసం సుకుమార్ చూపించిన ఈ లాజిక్ కనిపెట్టరా ?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం రంగస్థలం. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలనాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2018 మార్చ్ 31 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అప్పటివరకు రామ్ చరణ్ నటన పై కామెంట్ చేసిన వారు ఈ సినిమా తర్వాత చరణ్ యాక్టింగ్ కు ఫిదా అయ్యారు. చెవిటివాడి పాత్రలో చాలా అద్భుతంగా నటించడమే కాకుండా దాంట్లో జీవించాడనే చెప్పాలి.

ఇక ఈ మూవీలో చిట్టిబాబు పాత్రలో నటించిన రామ్ చరణ్ రంగస్థలం అనే గ్రామంలో వ్యవసాయ పొలాలకు నీరు పడుతూ జీవితం సాగిస్తుంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో జగపతిబాబు పోషించిన ప్రెసిడెంట్ పాత్రకి కూడా చాలా మంచి పేరు వచ్చింది. 30 ఏళ్లుగా ఎదురులేకుండా ప్రెసిడెంట్ గా రంగస్థలం ఊరిలో చలామణి అవుతారు జగపతిబాబు. అయితే ఈ సినిమాలో అందరూ ఆయన్ని ప్రెసిడెంట్ గారు అనే పిలుస్తారు తప్ప ఆయన పేరు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఎమ్మెల్యే దక్షిణామూర్తి అతడి పార్టీ తరపున రంగస్థలంలో ప్రెసిడెంట్ ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి రాబోయే ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా నామినేషన్ వేస్తాడు కుమార్ బాబు ( ఆది పినిశెట్టి). నామినేషన్ వేసిన తర్వాత చిట్టిబాబు, కుమార్ బాబు ఇద్దరూ కలిసి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి మేము మీకు వ్యతిరేకంగా నామినేషన్ వేసాము అని చెప్పి తిరిగి వెళుతుండగా.. రామ్ చరణ్ వెనక్కి తిరిగి ఒక డైలాగ్ చెప్తారు.

have you seen this dialogue of ram charan in rangasthalam movie

రంగస్థలంలో రాజకీయం మొదలైంది. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి ఫణేంద్ర భూపతి గారు అని అంటారు. అయితే ఊరిలో ఉన్న ఎవరికి తెలియని ఆయన పేరు రామ్ చరణ్ కి ఎలా తెలిసింది అని ఆ సినిమా చూసిన వాళ్ళలో చాలామందికి ఒక డౌట్ ఉంది. కానీ ఆ పేరు రామ్ చరణ్ కి ఎలా తెలిసిందంటే.. వీళ్లు నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీసులో ఇంతకుముందే నామినేషన్ వేసిన ప్రెసిడెంట్ గారి పేరు చూస్తారు. కాబట్టి చిట్టి బాబుకు ఆయన పేరు తెలుస్తుంది. ఇక చిట్టిబాబు ప్రెసిడెంట్ ని పేరు పెట్టి పిలిచే సీన్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది.

Admin

Recent Posts