వినోదం

రంగస్థలం సినిమా లో ఏమైనా లాజిక్ ఉంది అనిపించిందా మీకు?

90 లలో వచ్చిన మాధురీ దీక్షిత్, షారుఖ్ ఖాన్ నటించిన హిందీ సినిమా అంజామ్ చూసాను. క్లుప్తంగా కథేంటంటే కొత్తగా పెళ్లయిన మాధురీ పై మోజుతో ఆమె భర్త యాక్సిడెంట్లో మరణించేలా చేసిన ఫ్రెండ్ షారుఖ్ పై ఆమె ఎంతో అసహ్యం పెంచుకొంటుంది. ఓ రోజు ఆతనికే యాక్సిడెంటు అవడంతో డాక్టర్లు పెదవి విరిచేస్తారు. అప్పుడు ఈ హీరోయిన్ గారెంతో ఫీలయి అతనిపై ఉన్న పగతో అతన్ని చేర్చుకుని అతనింట్లోనే ఉంటూ అతనికన్ని సపర్యలుచేసి అతన్ని బాగుచేస్తుంది.

చివరికతను పూర్తిగా బాగయ్యాడని నిర్ధారణ చేసుకోవడానికిగానూ ఆమె పైట కూడా తీసేసి ఒక సెక్సీ డాన్స్ కూడా చేస్తుంది. చివరికతను పూర్తిగా బాగయ్యాడని నిర్ధారణయ్యాక తన బొడ్లోనే దాచుకున్న చురకత్తితో అతన్ని పొడిచి ఈహాహా అని నవ్వి నీపై పగతీర్చుకోవడానికి ఎంత కాలంనుండి ఎదురుచూస్తున్నానో తెల్సా అంటుంది. హబ్బాసినిమా చాలాబాగుంది కదా.

is there any login in rangasthalam movie

జీవితంలో ఆమెకొకే లక్ష్యం చావుకి దగ్గర్లో ఉన్న వాణ్ని కాపాడిబాగుచేసి వాడిపై పగసాధించాలి తర్వాత జైలుకు పోయినా పర్వాలేదు. అవును మన సినిమావాళ్ళు జైలుకైతే పోనేపోరు కదా.

మన (అతి) తెలివి దర్శకుడు సుకుమార్ తీసిన సినిమా కూడా హబ్బా సేమ్ ఇలాగే వీర లెవెల్లో ఉంది. దాన్ని మనందరం ఎగేసుకుని చూసాం.

Admin

Recent Posts